News


చిదంబరం పాత్రపై దర్యాప్తు చేయాలి: జిగ్నేష్‌షా

Monday 9th September 2019
news_main1568005241.png-28264

న్యూఢిల్లీ: ఎన్‌ఎస్‌ఈ కోలొకేషన్‌ కేసును సూపర్‌ వైట్‌ కాలర్‌ నేరంగా వ్యాపార వేత్త జిగ్నేష్‌షా అభివర్ణించారు. అక్రమంగా బిలియన్‌ డాలర్లు ఈ మార్గంలో ఆర్జించారని ఆరోపించారు. యూపీఏ హయాంలో కేవలం కొందరు బ్రోకర్లకు ట్రేడింగ్‌లో ప్రాధాన్యం ఇస్తూ వసతులు కల్పించిన ఈ కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, ఇతరుల పాత్రపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిగ్నేష్‌ షా ఎంసీఎక్స్‌ సహా ఎన్నో ఎక్సేంజ్‌లకు ఆద్యుడన్న విషయం తెలిసిందే. వ్యవసాయ ఉత్పత్తుల స్పాట్‌ ఎక్సేంజ్‌ ‘ఎన్‌ఎస్‌ఈఎల్‌’ రూ.5,600 కోట్ల చెల్లింపుల్లో విఫలం కావడంతో ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన అన్ని వ్యాపారాలను కోల్పోవాల్సి వచ్చింది. సంబంధిత కేసులో విచారణను కూడా ఎదుర్కొంటున్నారు. తన వ్యాపారాలు సంక్షోభంలో పడడానికి చిదంబరమే కారణమన్నది షా ఆరోపణ. చిదంబరం తన పెట్‌ ఎక్సేంజ్‌ (పెంపుడు) ప్రయోజనాలను కాపాడేందుకు తనను లక్ష్యంగా చేసుకున్నారని షా ఆరోపించారు. పూర్తి స్థాయి స్టాక్‌ ఎక్సేంజ్‌గా ఎంసీఎక్స్‌-ఎస్‌ఎక్స్‌ లైసెన్స్‌ పొందడంతో, దాని కార్యకలాపాలు ఆరంభించే పనిలో ఉన్న సమయంలోనే ఎన్‌ఎస్‌ఈఎల్‌ సంక్షోభం బయటకు వచ్చిందన్నారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం ఇప్పటికే జైలులో ఉన్నారు.



You may be interested

జీవీకేకు వ్యతిరేకంగా బోంబే హైకోర్టులో అదానీ పిటిషన్‌

Monday 9th September 2019

ముంబై: జీవీకే గ్రూపు నిర్వహణలోని ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (ఎంఐఏఎల్‌)కు వ్యతిరేకంగా అదానీ గ్రూపు బోంబై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఎంఐఏఎల్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన బిడ్‌వెస్ట్‌కు 13.5 శాతం వాటా ఉంది. ఈ వాటాను అదానీ గ్రూపునకు చెందిన మారిషస్‌ కంపెనీకి విక్రయించేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ డీల్‌ విలువ రూ.1,248 కోట్లు. దీన్ని అమలు చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలని అదానీ గ్రూపు తన పిటిషన్‌లో

ప్రభుత్వ బ్యాంకులు 12 చాలు!

Monday 9th September 2019

విలీనాల ప్రక్రియ దాదాపు పూర్తయినట్టే... ఆర్థిఖ శాఖ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య విలీనాల ప్రక్రియ దాదాపు పూర్తయినట్టేనని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. తాజాగా 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4 బ్యాంకులకు కుదిస్తూ విలీన నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. నవ భారత్‌ ఆకాంక్షలను తీర్చేందుకు ఇప్పుడు మిగలనున్న 12 బ్యాంకులు సరిపోతాయని కుమార్‌ పేర్కొన్నారు. పంజాబ్‌ నేషనల్‌

Most from this category