News


కియా కొత్తకారు ‘సెల్టోస్‌ విడుదల ఈ నెల 8న

Tuesday 6th August 2019
news_main1565071522.png-27563

  • ముఖ్యమంత్రి జగన్‌ను ఆహ్వానించిన కియా కంపెనీ ప్రతినిధులు
  • అనంతపురం ప్లాంట్‌లో కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం

సాక్షి, అమరావతి: దక్షిణకొరియా కార్ల దిగ్గజం కియా కంపెనీ తన కొత్తకారు ‘సెల్టోస్‌’ను ఈ నెల 8న మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కియా కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు. కియా కంపెనీ ఎండీ కూక్‌ హున్‌ షిమ్‌, చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ థామస్‌ కిమ్‌ సోమవారం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిసి అనంతపురం జిల్లా పెనుగొండలో నిర్వహించే కొత్త కారు విడుదల కార్యక్రమానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఏడాదికి 3 లక్షల​కార్లను పెనుగొండ ప్లాంటు ద్వారా ఉత్పత్తి చేయగలమని కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. భవిష్యత్‌లో 7 లక్షల కార్లను తయారు చేసే సామర్ధ్యానికి చేరుకుంటామని సీఎంకు వెల్లడించారు. ప్రస్తుతం టర్కీ స్లొవేకియాలకు ఇంజిన్లను కూడా ఎగుమతి చేస్తామన్నారు. కియా కొత్తకారు విడుదల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. 



You may be interested

ఈ షేర్లు కొనొచ్చు....బ్రోకరేజ్‌ల సిఫార్సులు

Tuesday 6th August 2019

భారతీయ స్టాక్ మార్కెట్లు ఆగస్టు 5 ట్రేడింగ్‌లో భారీగా పడిపోయాయి. బెంచ్‌మార్క్‌ సూచీలు వాటి కీలకమైన మద్దతు స్థాయిల కంటే దిగువకు పడిపోయాయి. ఎస్ అండ్ పి బీఎస్ఈ సెన్సెక్స్ 37,000 దిగువకు పడిపోగా, నిఫ్టీ 50 10,900 స్థాయిను కోల్పోయింది. జులై 5 నుంచి అగష్టు2 వరకు స్టాక్‌ మార్కెట్‌(బిఎస్‌ఈ)లో 11 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది. బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల సగటు మార్కెట్ క్యాపిటలైజేషన్ జూలై 5

గరిష్టస్థాయి వద్దే పసిడి

Tuesday 6th August 2019

నిన్నటి ట్రేడింగ్‌లో ఆరేళ్ల గరిష్టానికి ఎగిసిన పసడి ధర మంగళవారం దాదాపు అదేస్థాయి వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో నేడు ఔన్స్‌ పసిడి 1474 డాలర్ల వద్ద కదులుతోంది. గతవారంలో చైనాకు దిగుమతి అవుతున్న 300బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై 10శాతం టారీఫ్‌లను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రికత్తలు మొదలయ్యాయి. ట్రంప్‌ ప్రకటనకు ప్రతిగా చైనా అమెరికా డాలర్‌ విలువను క్షీణింపజేసేందుకు తన కరెన్సీ విలువను

Most from this category