News


ఓఎంసీలపై సీఎల్‌ఎస్‌ఏ అప్రమత్తత!

Thursday 21st March 2019
news_main1553153460.png-24725

చమురు మార్కెటింగ్‌ కంపెనీల(హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, బీపీసీఎల్‌) షేర్లపై అప్రమత్తంగా ఉన్నట్లు ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది. ఈ షేర్లన్నీ గత నెల రోజుల్లో దాదాపు 30 శాతం వరకు ర్యాలీ జరిపాయి. ఈ నేపథ్యంలో వీటిపై ఇచ్చిన ‘అమ్మొచ్చు’ కాల్‌ను కొనసాగిస్తున్నట్లు సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. ప్రపంచంలోనే ఇవి వాల్యూషన్లు అత్యధికంగా ఉన్న రిఫైనరీ కంపెనీల షేర్లని తెలిపింది. క్రూడాయిల్‌ ధరలో క్రమానుగత పెరుగుదల ఈ కంపెనీలపై నెగిటివ్‌ ప్రభావం చూపుతుందని తెలిపింది. స్థిర ప్రభుత్వంపై ఆశలతో మార్కెట్లో కొనసాగుతున్న ర్యాలీ, ఎర్నింగ్స్‌పై అంచనాలతో ఈ కంపెనీల షేర్లు తాజాగా అప్‌మూవ్‌ చూపాయని సీఎల్‌ఎస్‌ఏ అభిప్రాయపడింది. ఈ ర్యాలీతో వీటి వాల్యూషన్లు చాలా ఖరీదుగా మారాయని వివరించింది. మార్జిన్ల విషయంలో అనూహ్య పాజిటివ్‌ ఫలితాలుంటాయని పలువురు భావిస్తున్నారని, కానీ అవి ఫలించకపోవచ్చని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో 2014 నాటి ఫలితాలు మరోమారు రిపీట్‌ కాకపోవచ్చని పేర్కొంది.
గతంలో
2014 ఎన్నికల ముందు ఈ కంపెనీలు దాదాపు 90 శాతం, తర్వాత దాదాపు 50 శాతం ర్యాలీ జరిపాయి. కానీ ఈ దఫా ఇలాంటి ఛాన్సులు కనిపించడంలేదని సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది. ఆ సమయంలో వాల్యూషన్లు చాలా తక్కువగా ఉండడం, డీజిల్‌, గ్యాస్‌ సబ్సిడీల విషయంలో భారీ సంస్కరణలు రావడం, క్రూడాయిల్‌ ధరల పతనం లాంటివి ఓఎంసీలకు కలిసివచ్చాయని వివరించింది. కానీ ఇప్పుడీ పరిస్థితులు లేవని పేర్కొంది. క్రూడాయిల్‌ ధర 70 డాలర్లకు వస్తే మార్జిన్లు సాధారణ స్తితికి వస్తాయని తెలిపింది. ఒపెక్‌ ఎప్పటికప్పుడు ఉత్పత్తికోతలు విధించుకుంటూ పోతోందని, అందువల్ల చమురు నిల్వలు తరిగిపోతాయని, ఇవన్నీ కలిసి బ్రెంట్‌ క్రూడ్‌ ధరను 70 డాలర్లకు చేరుస్తాయని అంచనా వేసింది. ప్రస్తుతం ఆసియా కంపెనీల గ్రాస్‌రిఫైనింగ్‌ మార్జిన్లు(జీఆర్‌ఎం) నీరసంగా ఉన్నాయని, ఇదే వాతావరణం మరో సంవత్సరం పైగా కొనసాగవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో ఓఎంసీ షేర్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

 



You may be interested

లాభాల్లో ఆసియా మార్కెట్లు... మిశ్రమంగా యూరప్‌ మార్కెట్లు

Thursday 21st March 2019

ఫెడ్‌రిజర్వ్‌ వడ్డీరేట్లపై యథాతధ పాలసీ ప్రకటన నేపథ్యంలో గురువారం ఆసియాలో హాంకాంగ్‌ మినహా మిగిలిన మార్కెట్లు లాభాల బాట పట్టాయి. అయితే అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమన ఆందోళనలు, అమెరికా - చైనా వాణిజ్య చర్చలు మార్కెట్ల లాభాల్ని పరిమితం చేస్తున్నాయి. అలాగే ప్రపంచమార్కెట్లో 4నెలల గరిష్టస్థాయి స్థాయిల నుంచి ముడిచమురుధరలు దిగిరావడం, డాలర్‌ ఇండెక్స్‌ పతనం తదితర అంశాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చాయి. అన్ని మార్కెట్లు అరశాతం లాభపడ్డా‍యి. అత్యధికంగా

3వారాల గరిష్టానికి పసిడి

Thursday 21st March 2019

ఈ ఏడాది వడ్డీరేట్ల పెంపు ఉండదనే ఫెడ్‌ రిజర్వ్‌ సంకేతాలతో గురువారం పసిడి ధర పరుగులు పెడుతోంది. ఆసియాలో ఏకంగా ఔన్స్‌ పసిడి ధర ఏకంగా 17డాలర్లు ర్యాలీ చేసి 3వారాల గరిష్టాన్ని తాకింది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లపై యధాతధ పాలసీ విధానానికే కట్టబడి ఉన్నట్లు బుధవారం ప్రకటించింది. అలాగే ఈ ఏడాది(2019)లో కూడా వడ్డీరేట్ల పెంపు ఉండకపోవచ్చనే సంకేతాలనిచ్చింది. ఫెడ్‌ రిజర్వ్‌ అంతర్జాతీయ ఆర్థికవృద్ధి

Most from this category