News


కార్వీ జీఎస్‌టీ వ్యాపారం క్లియర్‌ ట్యాక్స్‌ సొంతం

Tuesday 10th March 2020
news_main1583812909.png-32381

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీ కార్వీ కార్పొరేట్‌కు చెందిన కార్వీ వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వ్యాపార, సాంకేతికత విభాగాన్ని బెంగళూరుకు చెందిన ఆన్‌లైన్‌ ఫైనాన్షియల్‌ టెక్నాలజీ కంపెనీ క్లియర్‌ ట్యాక్స్‌ కొనుగోలు చేసింది. డీల్‌ విలువ ఎంతనేది కంపెనీ వెల్లడించలేదు. దీంతో కార్వీకి చెందిన 200లకు పైగా ఎంటర్‌ప్రైజెస్‌ కస్టమర్లు, 25 మంది ఉద్యోగులు, టెక్నాలజీ క్లియర్‌ ట్యాక్స్‌కు బదిలీ అవుతాయని క్లియర్‌ట్యాక్స్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ అర్చిత్‌ గుప్తా తెలిపారు. ఈ కొనుగోలుతో మా జీఎస్‌టీ ఎంటర్‌ప్రైజెస్‌ విభాగం మరింత బలోపేతం అయిందని, ఈ విభాగంలో లీడర్‌షిప్‌గా ఎదిగామన్నారు. ప్రస్తుతం క్లియర్‌ ట్యాక్స్‌కు ఎస్‌ఏపీలో 400లకు పైగా కస్టమర్లున్నారు. ఇప్పటివరకు క్లియర్‌ ట్యాక్స్‌ 65 మిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించింది. పేపాల్‌ కో–ఫౌండర్స్‌ పీటర్‌ థిల్‌ మ్యాక్స్‌ లెవ్‌చిన్, పేటీఎం ఫౌండర్‌ విజయ్‌ శేఖర్‌శర్మ, వాట్సాప్‌ మాజీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ నీరజ్‌ అరోరాలతో పాటూ కంపోసైట్, సికోయా క్యాపిటల్స్, సైఫ్‌ పార్టనర్స్‌ వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ తన ఆస్తుల అమ్మకం ద్వారా నిధులను సమీకరించి బ్యాంక్‌లు, ఇన్వెస్టర్ల బకాయిలను చెల్లించే తరుణంలో క్లియర్‌ ట్యాక్స్‌తో డీల్‌ కుదరడం గమనార్హం. 



You may be interested

ఎస్‌బీఐ సీఎఫ్‌ఓ వెంకట నాగేశ్వర్‌

Tuesday 10th March 2020

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీ కార్వీ కార్పొరేట్‌కు చెందిన కార్వీ వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వ్యాపార, సాంకేతికత విభాగాన్ని బెంగళూరుకు చెందిన ఆన్‌లైన్‌ ఫైనాన్షియల్‌ టెక్నాలజీ కంపెనీ క్లియర్‌ ట్యాక్స్‌ కొనుగోలు చేసింది. డీల్‌ విలువ ఎంతనేది కంపెనీ వెల్లడించలేదు. దీంతో కార్వీకి చెందిన 200లకు పైగా ఎంటర్‌ప్రైజెస్‌ కస్టమర్లు, 25 మంది ఉద్యోగులు, టెక్నాలజీ క్లియర్‌ ట్యాక్స్‌కు బదిలీ అవుతాయని క్లియర్‌ట్యాక్స్‌

ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు లబోదిబో

Tuesday 10th March 2020

2000 పాయింట్లు పడిన డోజోన్స్‌ అన్నివైపుల నుంచీ అమ్మకాల వెల్లువ 2 రోజుల్లో 34 శాతం పడ్డ చమురు ధరలు 15 శాతం కుప్పకూలిన ఎనర్జీ ఇండెక్స్‌ 2004 తదుపరి కనిష్టానికి ఎనర్జీ ఇం‍డెక్స్‌ 8 శాతం పతనమైన యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ దశాబ్ద కాలం తరువాత మళ్లీ అమెరికా స్టాక్‌ మార్కెట్లకు నష్టాల షాక్‌ తగిలింది. అన్ని వైపుల నుంచీ అమ్మకాలు వెల్లువెత్తడంతో ప్రారంభమైన పావు గంటలోనే ట్రేడింగ్‌ నిలిచిపోయింది. ఎప్పుడో దశాబ్ద కాలం క్రితం అంటే

Most from this category