News


బ్యాంకింగ్‌ అధికారులపై విజిలెన్స్‌ కేసులు క్లియర్‌ చేయాలంటూ ఆదేశాలు

Saturday 28th December 2019
news_main1577530107.png-30499

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదేశాలు
న్యూఢిల్లీ: బ్యాంకు అధికారులపై నమోదైన పెండింగ్‌ విజిలెన్స్‌ కేసులను క్లియర్‌ చేయమంటూ ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్థిక శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అవకతవకలకు పాల్పడిన అభియోగాలపై పెండింగ్‌లో ఉన్న అధికారుల కేసులను క్లియర్‌ చేయమంటూ ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదేశించారు. కాగా.. జనవరి 1 నుంచీ కొన్ని ఎంపిక చేసిన చెల్లింపులపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌(MDR) చార్జీలు ఎత్తివేస్తున్నట్లు తెలియజేశారు. ఈ అంశాలను త్వరలో నోటిఫై చేయనున్నట్లు వెల్లడించారు. శనివారం ప్రభుత్వ రంగ బ్యాంకుల అత్యున్నత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం తదుపరి సీతారామన్‌ తాజా ఆదేశాలను జారీ చేశారు. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు వీలుగా జులై బడ్జెట్‌లో సీతారామన్‌ ఎండీఆర్‌ చార్జీలను రద్దు చేసేందుకు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ వ్యయాలను ఆర్‌బీఐ, బ్యాంకులు భరిస్తాయని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. డిజిటల్‌ చెల్లింపులు పెరగడం ద్వారా తగ్గనున్న నగదు నిర్వహణ వ్యయాల నుంచి వీటిని బ్యాంకులు సర్దుబాటు చేసుకుంటాయని తెలియజేశారు.



You may be interested

2019: పసిడి లాభాల కాంతులు

Saturday 28th December 2019

ఈ ఏడాది పసిడి ఇన్వెస్టర్లకు మంచి లాభాల్ని పంఛింది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఉద్రికత్తలు, యూరోజోన్‌లో బ్రెగ్జిట్‌ అనిశ్చితిలతో పాటు ఇతర భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల తగ్గింపు తదితర కారణాలు పసిడి ఫ్యూచర్లను పరుగులు పెట్టించాయి. ఫలితంగా గడిచిన ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ 2019లో దాదాపు పసిడి 13.50శాతం పెరిగింది. అగ్ర రాజ్యాల వాణిజ్య యుద్ధం:-  అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం

3-4వారాల్లో 9శాతం ర్యాలీ చేసే షేర్లు ఇవే...!

Saturday 28th December 2019

నిఫ్టీ -50 ఇండెక్స్‌ 12000 స్థాయి వద్ద స్థిరమైన మద్దతు స్థాయిని ఏర్పాటు చేసుకునే పనిలో ఉందని ఐసీఐసీఐ డెరెక్టర్‌.కామ్‌ రిసెర్చ్‌ హెడ్‌ సాంకేతిక నిపుణుడు ధర్మేంద్ర షా అభిప్రాయపడుతున్నారు. కాల్‌ ఆప్షన్స్‌ పొజిషన్లు సైతం గరిష్టస్థాయి 12500 మార్చబడ్డాయని షా అంటున్నారు. ఈ నేపథ్యంలో 3-4వారాల్లో 9శాతం ర్యాలీ చేసే షేర్లను ఆయన సిఫార్సు చేశారు.  షేరు పేరు:- ఎస్‌బీఐ రేటింగ్‌:- కొనవచ్చు టార్గెట్‌ ధర:- రూ.360 స్టాప్‌ లాస్‌:- రూ.324 అప్‌ సైడ్‌:- 7శాతం  షేరు

Most from this category