News


హైదరాబాద్‌లో క్లీన్‌ హార్బర్స్‌ కొత్త కార్యాలయం

Tuesday 14th January 2020
news_main1578973874.png-30905

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- ఎన్విరాన్‌మెంటల్‌ సేవల్లో ఉన్న యూఎస్‌ కంపెనీ క్లీన్‌ హార్బర్స్‌ హైదరాబాద్‌లో నూతన కార్యాలయం ఏర్పాటు చేసింది. 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హైటెక్‌ సిటీలో ఈ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ను (జీసీసీ) నెలకొల్పారు. ఉత్తర అమెరికా తర్వాత సంస్థకు ఇదే అతిపెద్ద జీసీసీ. 650 మంది కూర్చునే వీలుగా ఏర్పాటు ఉంది. ప్రస్తుతం ఇక్కడ 300 మంది ఉద్యోగులు ఉన్నారు. 12-18 నెలల్లో ఈ సంఖ్యను రెట్టింపు చేస్తామని క్లీన్‌ హార్బర్స్‌ చైర్మన్‌ అలెన్‌ మెక్‌కిమ్‌ సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఐటీ, హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌, లీగల్‌ విభాగాల్లో ఈ నియామకాలు ఉంటాయని వివరించారు. క్లీన్‌ హార్బర్స్‌కు ప్రపంచవ్యాప్తంగా 7,000 కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. హైదరాబాద్ సెంటర్‌ ఈ క్లయింట్లకు సేవలు అందిస్తుందన్నారు. కంపెనీ ఉత్పత్తులు, సేవలను భారత్‌లో పరిచయం చేసే విషయమై అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. నూతన కార్యాలయం కోసం రూ.30 కోట్లు వెచ్చించామని కంపెనీ కంట్రీ మేనేజర్‌ అవినాశ్‌ సామృత్‌ తెలిపారు. భారత్‌లో ఇప్పటి వరకు క్లీన్‌ హార్బర్స్‌ రూ.50 కోట్లు ఖర్చు చేసిందన్నారు. 



You may be interested

ఫ్లాట్‌ ప్రారంభం

Tuesday 14th January 2020

క్రితం రోజు కొత్త రికార్డుల్ని నెలకొల్పిన స్టాక్‌ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 20 పాయింట్ల స్వల్ప పెరుగుదలతో 41,820 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 3 పాయింట్ల స్వల్ప తగ్గుదలతో 12,320 పాయింట్ల సమీపంలోనూ మొదలయ్యాయి. 

బంగారంపై బాదుడు తగ్గేనా..?

Tuesday 14th January 2020

దిగుమతి సుంకాలు తగ్గించాలని విన్నపాలు ప్రస్తుతం ఈ రేటు 12.5 శాతం భారీ వడ్డనతో కుదేలైన పరిశ్రమ న్యూఢిల్లీ: పసిడిపై ప్రస్తుతం అమల్లో ఉన్న 12.5 శాతం ఇంపోర్ట్‌ డ్యూటీ (దిగుమతి సుంకం)ని సాధ్యమైనంత మేర తగ్గించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. వచ్చే నెల తొలి వారంలో ప్రవేశపెట్టనున్న 2020-21 కేంద్ర బడ్జెట్‌లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని విన్నవించినట్లు విశ్వసనీయ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. ఇప్పటికే ఈ

Most from this category