News


రూ.4,800 కోట్ల డిపాజిట్ల క్లెయిమ్‌లకు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఆమోదం

Monday 6th January 2020
news_main1578281543.png-30690

ముంబై: నిధుల సంక్షోభంలో ఉన్న దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) ఇప్పటి వరకు రూ.4,800 కోట్ల డిపాజిట్ల చెల్లింపుల క్లెయిమ్‌లను ఆమోదించినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. సమారు 55,000 మంది డిపాజిట్‌ హోల్డర్లు రూ.5,200 కోట్ల డిపాజిట్లకు సంబంధించి క్లెయిమ్‌లను డిసెంబర్‌ 17 నాటికి దాఖలు చేయగా.. రూ.4,800 కోట్ల క్లెయిమ్‌లను అనుమతించినట్టు వెల్లడించాయి. వీరిలో రిటైలర్లతోపాటు యూపీ పవర్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు సైతం ఉన్నారు. వీటితో పాటు అన్ని రకాల క్లెయిమ్‌లు (రుణదాతలు సహా) కలపి రూ.93,105 కోట్లుగా ఉన్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. వీటిల్లో రూ.85,800 కోట్ల క్లెయిమ్‌లను కంపెనీ పరిష్కార నిపుణుడు ఆర్‌ సుబ్రమణియకుమార్‌ అనుమతించినట్టు పేర్కొన్నాయి. డిసెంబర్‌ 3న ఎన్‌సీఎల్‌టీ ఆదేశాల తర్వాత.. రుణదాతలతోపాటు డిపాజిట్‌ దారుల నుంచి డిసెంబర్‌ 17వ తేదీ నాటికి క్లెయిమ్‌ దరఖాస్తులను ఆహ్వానించిన విషయం గమనార్హం. వచ్చిన క్లెయిమ్‌లలో రూ.86,892 కోట్లు ఆర్థిక రుణదాతలవి. వీటిల్లో ఎస్‌బీఐ రూ.10,083 కోట్లు, బ్యాంకు ఆఫ్‌ ఇండియా రూ.4,125 కోట్లు, కెనరా బ్యాంకు రూ.2,682 కోట్లు, యూనియన్‌ బ్యాంకు రూ.2,378 కోట్లు, బ్యాంకు ఆఫ్‌ బరోడా రూ.2,075 కోట్లు, నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు రూ.2,434 కోట్ల క్లెయిమ్‌లు కూడా ఉన్నాయి. 



You may be interested

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Monday 6th January 2020

అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతల నడుమ ప్రపంచ మార్కెట్ల సంకేతాలకు అనుగుణంగా సోమవారం భారత్‌ స్టాక్‌ సూచీలు గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 126 పాయింట్ల క్షీణతతో 41,338 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 56 పాయింట్ల గ్యాప్‌డౌన్‌తో 12,170 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

ఫండ్స్‌లో ఏ ప్లాన్‌ ఎంచుకోవాలి ?

Monday 6th January 2020

ప్ర: నాకు రెండేళ్ల కూతురు ఉంది. తనను మంచి చదువులు చదివించాలన్న ఆలోచనతో స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మొదలు పెట్టాను. ఇది సరైన నిర్ణయమేనా ?  -అనిత, విశాఖపట్టణం  జ: మీరు మొదటిసారిగా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లయితే ఇది సరైన నిర్ణయం కాదు. ఆరంభంలో స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ పనితీరు ఆశించినట్లుగా ఉండకపోవచ్చు. దీంతో మొదటిసారిగా ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే ఇన్వెస్టర్లు బెంబేలు పడతారు. ఫండ్సంటే భయపడేలా నష్టాలూ

Most from this category