News


అందరినీ ఆర్థికంగా ఆదుకోండి

Saturday 21st March 2020
news_main1584766479.png-32613

పేదోడికి రూ.5,000 సాయం చేయండి
బలహీన వర్గాలకు రూ.10 వేలు ఇవ్వండి
ప్రధానిని కోరిన పరిశ్రమల సమాఖ్య


పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థపై కరోన ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పన్ను తగ్గింపులు, వడ్డీ రేట్ల కోతతోపాటు రూ.2 లక్షల కోట్ల ఆర్థిక ఉద్ధీపన ప్రకటించాలని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరింది. వ్యాపారాలకు భారీ అంతరాయం రానుందని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ అ‍న్నారు. కరోన మూలంగా రియల్టీ, విమానయానం, పర్యాటక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. ‘ఆధార్‌ ఆధారంగా గ్రామీణ, పట్టణ నిరుపేదలకు ఒక్కొక్కరికి రూ.5,000 నేరుగా వారి ఖాతాకు జమచేయాలి. బలహీన వర్గాలు, వృద్ధులకు రూ.10,000 అందించండి. వ్యక్తుల్లో ఆర్థిక భయాలను తొలగించేందుకు ఇది దోహదం చేస్తుంది’ అని తన లేఖలో తెలిపారు.
వేతనాలను తగ్గించుకోవాలి..
వ్యయ భారం తగ్గేందుకు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్స్‌ స్థాయిలో వేతనాలను కుదించుకోవాలి అని చంద్రజిత్‌ సూచించారు. ‘ప్రభుత్వం లాంగ్‌ టెర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌పై 10 శాతమున్న పన్నును ఎత్తవేయాలి. టోటల్‌ డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ను 25 శాతానికి చేర్చాలి. ఇన్వాయిస్‌ల ఆధారంగా కాకుండా బిల్లుల వసూళ్లపై మాత్రమే జీఎస్టీ అమలు చేయాలి. పరిశ్రమకు బ్యాంకులు నిధులు సమకూర్చేందుకు వీలుగా క్యాష్‌ రిజర్వ్‌ రేషియో, రెపో రేట్లు 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించాలి. నిరర్ధక ఆస్తులుగా ప్రకటనకు 90 రోజుల నిబంధనకు బదులుగా 180 రోజులు చేయాలి. ఇవి వెంటనే అమలైతే కరోన కారణంగా తలెత్తే ఆర్థిక ప్రభావాన్ని నియంత్రించవచ్చు. బ్యాంకులపై ఎన్‌పీఏల ఒత్తిడి ఉండదు’ అని లేఖలో వివరించారు.
 


CII

You may be interested

నిలిచిపోయిన వోల్వో కార్స్‌ ఉత్పత్తి

Saturday 21st March 2020

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘వోల్వో’ అంతర్జాతీయంగా పలు ప్రాంతాల్లో తన ఉత్పత్తిని ఆపివేసింది. కోవిడ్‌-19 (కరోనా) వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా యూరప్‌, అమెరికాల్లోని ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు శుక్రవారం ప్రకటించింది. బెల్జియం ప్లాంట్‌లో మంగళవారమే ఉత్పత్తిని నిలుపుచేయగా, స్వీడన్‌లోని మూడు ప్లాంట్లలోనూ.. అమెరికాలోని దక్షిణ కెరొలినలోని ప్లాంట్లలో మార్చి 26 నుంచి ఉత్పత్తి ఆపివేస్తున్నట్లు వివరించింది. ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడి, సంస్థ కొనసాగడం కోసం

కోవిడ్‌-19 రక్షణకు స్టార్‌ హెల్త్‌ నుంచి పాలసీ

Saturday 21st March 2020

 కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) పాజిటివ్‌గా తేలి, హాస్పిటల్‌ పాలైన వారికి కవరేజీని అందించే పాలసీని స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ సంస్థ తీసుకొచ్చింది. ‘స్టార్‌ నోవెల్‌ కరోనా వైరస్‌’ అనే పేరుతో వచ్చిన ఈ పాలసీలో 18-65 సంవత్సరాల వయసు వారు పాజిటివ్‌గా నిర్ధారణ అయితే, ఈ పాలసీ కింద ఏక మొత్తంలో పరిహారాన్ని కంపెనీ అందిస్తుంది. విదేశీ పర్యటన చరిత్ర ఉండకూడదన్న షరతులు ఈ పాలసీలో లేకపోవడం సానుకూలం.

Most from this category