News


వ్యాపార వివాదాలను క్రిమినల్ కేసులుగా చూడొద్దు..

Wednesday 25th December 2019
news_main1577245283.png-30420

  • సీఐఐ స్టార్టప్ కౌన్సిల్ చైర్మన్‌ క్రిస్ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: వ్యాపార, సివిల్ వివాదాలను క్రిమినల్ కేసులుగా చూస్తున్న ఉదంతాలు ఈ మధ్య గణనీయంగా పెరుగుతున్నాయని పరిశ్రమల సమాఖ్య సీఐఐ స్టార్టప్ కౌన్సిల్ చైర్మన్ క్రిస్ గోపాలకృష్ణన్ చెప్పారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలు, విదేశీ ఇన్వెస్టర్లను ఇది తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. మోసం చేయాలనే ఉద్దేశం ఉంటే తప్ప వ్యాపార వివాదాలన్నీ సివిల్ కోర్టుల పరిధిలోకే వస్తాయని, వాటిని క్రిమినల్ కేసులుగా చూడరాదని చెప్పారు. ఆర్బిట్రేషన్ లేదా సివిల్ కోర్టుల పరిధిలోకి వచ్చే వివాదాలకు సంబంధించిన కేసులను క్రిమినల్ పరిధి నుంచి తప్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనితో దేశ, విదేశ ఇన్వెస్టర్లలో భారత్‌పై నమ్మకం పెరుగుతుందని, దేశీయంగా వ్యాపారాలకు అనువైన పరిస్థితులు నెలకొనేందుకు కూడా ఇది ఉపయోగపడగలదని క్రిస్ చెప్పారు. ఇందుకు సంబంధించి కంపెనీల చట్టంలోని కొన్ని నిబంధనలు మార్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే వెల్లడించిన నేపథ్యంలో క్రిస్ గోపాలకృష్ణన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హురున్ గ్లోబల్ యూనికార్న్ జాబితా 2019 ప్రకారం 21 యూనికార్న్స్‌తో (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ గల అంకుర సంస్థలు) స్టార్టప్స్ ప్రపంచంలో భారత్ మూడో స్థానంలో ఉంది. అమెరికా, చైనా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. 



You may be interested

భారత్ లో ఆర్థిక మందగమనం

Wednesday 25th December 2019

తక్షణ చర్యలు అవసరం భారత్‌కు ఐఎంఎఫ్‌ సూచన విధానపరమైన చర్యలు తీసుకోవాలని సలహా రుణ వృద్ధి, ప్రైవేటు వినియోగం  బలహీనంగా ఉన్నాయని వ్యాఖ్య వాషింగ్టన్‌: భారత్‌లో ఆర్థిక మందగమన పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అభిప్రాయపడింది. దీర్ఘకాల ఈ ధోరణిని అరికట్టడానికి కేంద్రం తక్షణం విధానపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఐఎంఎఫ్‌ డైరెక్టర్స్‌ నివేదిక వెలువరించిన అంశాలను సంస్థ ఆసియా, పసిఫిక్‌ శాఖలో భారత్‌ వ్యవహారాల చీఫ్‌ రానిల్‌ సల్‌గాడో

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అపార అవకాశాలు

Wednesday 25th December 2019

2019లో రెట్టింపైన నిపుణులు గ్రేట్ లెర్నింగ్ సంస్థ నివేదిక న్యూఢిల్లీ: వ్యాపార సంస్థల్లో కొంగొత్త టెక్నాలజీల వినియోగం మెరుగుపడుతున్న నేపథ్యంలో దేశీయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. 2019లో ఏఐ ఉద్యోగుల సంఖ్య రెట్టింపయ్యింది. అయితే, నిపుణులు తగినంత స్థాయిలో దొరక్కపోతుండటంతో ఇంకా చాలా రంగాల సంస్థల్లో ఏఐ ఉద్యోగాలు ఖాళీగా ఉంటున్నాయని, ఈ విభాగంలో నిపుణులకు అపార అవకాశాలు ఉన్నాయని ఎడ్యుటెక్ సంస్థ గ్రేట్ లెర్నింగ్

Most from this category