News


సిగ్నిటీ టెక్నాలజీస్‌కు రూ.36 కోట్ల లాభం

Saturday 2nd November 2019
news_main1572667910.png-29300

హైదరాబాద్‌: సిగ్నిటీ టెక్నాలజీస్‌ సంస్థ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.215 కోట్ల టర్నోవర్‌పై రూ.36 కోట్ల లాభాన్ని ప్రకటించింది. క్రింత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న రూ.205 కోట్ల ఆదాయంతో పోలిస్తే 5 శాతం వృద్ధి నమోదైంది. కానీ, నికర లాభం మాత్రం క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న రూ.49.52 కోట్లతో పోలిస్తే 25 శాతం వరకు తగ్గినట్టు తెలుస్తోంది. కానీ, సీక్వెన్షియల్‌గా చూస్తే మాత్రం కూ1లో నికర లాభం రూ.28.5 కోట్లతో పోలిస్తే వృద్ధి నమోదైంది. క్యూ2లో ఎబిటారూ.68.52 కోట్లకు పెరిగింది. ఇంజనీరింగ్‌, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ సేవల్లో సిగ్నిటీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 



You may be interested

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లాభం రూ.266 కోట్లు

Saturday 2nd November 2019

32 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం  రూ.11,986 కోట్లకు చేరిన మొత్తం ఆదాయం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.266 కోట్ల నికర లాభం సాధించింది. కేటాయింపులు తగ్గడం, నికర వడ్డీ ఆదాయం బాగా ఉండటం, ఇతర ఆదాయం పెరగడంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో

గూగుల్ చేతికి ఫిట్‌బిట్‌

Saturday 2nd November 2019

2.1 బిలియన్ డాలర్ల డీల్‌ వాషింగ్టన్‌: టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా వేరబుల్ టెక్నాలజీ సంస్థ ఫిట్‌బిట్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ 2.1 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఆరోగ్యవంతమైన జీవనం సాగించేందుకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.8 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు తమ ఉత్పత్తులను విశ్వసిస్తున్నారని ఈ సందర్భంగా ఫిట్‌బిట్‌ సహ-వ్యవస్థాపకుడు, సీఈవో జేమ్స్ పార్క్ తెలిపారు. అత్యుత్తమమైన హార్డ్‌వేర్‌,

Most from this category