News


టాటామోటర్స్‌ జేఎల్‌ఆర్‌కు కరోనా వైరస్‌ కష్టాలు

Friday 7th February 2020
news_main1581060172.png-31595

  • చైనాలో జేఎల్‌ఆర్‌ ప్లాంట్‌ మూసివేత
  • మార్చి 31లోగా బీఎస్‌-VI వాహనాలు అందుబాటులోకి కష్టమే: పవన్ గోయెంకా

మార్చి 31లోగా బీఎస్‌-VI వాహనాలు అందుబాటులోకి కష్టమే: ఎంఅండ్‌ఎం
చైనాలో కరోనా వ్యాధి వ్యాప్తితో టాటా మోటర్స్‌ కంపెనీ జేఎల్‌ఆర్‌ వాహన ఉత్పత్తులపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. టాటా మోటర్స్‌,  చైనా కంపెనీ చెర్రీ.. జాయింట్‌వెంచర్‌గా ఏర్పాటుచేసిన జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ ప్లాంట్‌ చైనాలోని షాంఘై నగర సరిహద్దుల్లో కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రాంతం కరోనా వైరస్‌ పుట్టికొచ్చిన వుహాన్‌ పట్టణానికి కేవలం 800 కి.మీటర్ల దూరంలో ఉంది. ఈ చెర్రీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్లాంట్‌ ఏడాదికి 2లక్షల యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే జేఎల్‌ఆర్‌ వాహనాలు చైనాలోని మొత్తం వాహన అమ్మకాల్లో ఐదోవంతు ఉంటుంది. చైనాకు ఎగుమతయ్యే మొత్తం వాహనాల్లో 75శాతం బయటి దేశాల నుంచి ఎగుమతి కాగా, మిగిలిన 25శాతం నుంచి ఈ ప్లాంట్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయి. వార్షిక ప్రాతిపదికన ఈ యూనిట్‌ డిసెంబర్‌ త్రైమాసికపు రిటైల్‌ వాహన ఉత్పత్తులు ఏకంగా 21శాతం వృద్ధిని సాధించాయి. చైనాలో కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి రోజురోజుకూ విజృంభిస్తుండంతో టాటామోటర్స్‌  ప్లాంట్‌ సెలవుదినాల్ని మరికొంతకాలం పాటు పొడిగించింది. అలాగే 3వేల మంది సిబ్బందిని ఇంటి వద్ద నుంచే సేవలు అందించాలని కోరింది. చైనాలో హెల్త్‌ ఎమర్జెన్సీ పరిస్థితి ధీర్ఘకాలం పాటు కొనసాగితే జేఎల్‌ఆర్‌ ఉత్పత్తులు భారీగా తగ్గుపట్టి కంపెనీ ఆదాయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో దేశీయంగా అమ్మకాలు మందగించినప్పటికీ.., చైనాలో జేఎల్‌ఆర్‌ వాహనాల అమ్మకాలు పుంజుకోవడంతో టాటా మోటర్స్‌ కంపెనీ రూ.1788 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. సంస్థ ఏకీకృత ఆదాయంలో జేఎల్‌ఆర్‌ వాటా 80శాతానికి పైగా ఉంటుంది.

 

చైనాలో పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం: యాజమాన్యం
చైనాలో పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని టాటామోటర్స్‌ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్యోగుల ఆరోగ్యాన్ని  పర్యవేక్షించేందుకు ఒక అప్లికేషన్‌ను కూడా అభివృద్ధి చేసినట్లు తెలిపింది. చైనాలో చాలా రాష్ట్రాలు నూతన సంవత్సర సెలవులను ఫిబ్రవరి 9వరకు పొడిగించాయి. సంబంధిత ఉద్యోగులకు అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవడానికి, అవసరమైతే సహాయాన్ని అందించేందుకు యాజమాన్యం ఎల్లపు‍్పడూ సిద్ధంగా ఉంటుందని సంస్థ తెలిపింది. మా మొదటి ప్రాధాన్యత సిబ్బంది ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగులు వైరస్‌ బారిన పడితే వారికి కంపెనీ తరుపున పూర్తి సహాయ సహాకారాలు అందిస్తామని టాటామోటర్స్‌ గ్రూప్‌ సీఎఫ్‌ఓ పీబీ బాలాజీ తెలిపారు.

మార్చి 31లోగా బీఎస్‌-VI వాహనాలు అందుబాటులోకి కష్టమే: ఎంఅండ్‌ంఎ 
కరోనా వైరస్‌ వ్యాధి కారణంగా చైనాలోని ఉత్పత్తి భారీగా తగ్గిపోవడం బీఎస్‌-VI వాహనాల విడిభాగాల సరఫరాపై ప్రభావం చూపుతుందని మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం పర్యావరణ సంరక్షణలో భాగంగా అన్ని అటో కంపెనీలు మార్చి 31వ తేదీనాటికి బీఎస్‌-VI ప్రమాణాలను కలిగిన వాహనాలకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. బీఎస్‌-VI  వాహనాల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ చైనా నుండి దిగుమతి అవుతోందని ఇప్పుడు ఈ దేశంలో ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో వాటి లభ్యత కష్టతరంగా మారిందని గోయెంకా  చెప్పుకొచ్చారు. పరిస్థితి మెరుగుపడకపోతే, మార్చి 31 లోపు మేము బీఎస్‌-IV వాహనాలను అందుబాటులోకి తీసుకురావడం అంసభమని, ఈ ఊహించని పరిస్థితిలో గడువును పొడిగించాలని మేము సుప్రీంకోర్టును అభ్యర్థించవలసి ఉంటుంది. అని గోయెంకా తెలిపారు. You may be interested

మెట్రోపోలిస్‌- యూఎస్‌ఎల్‌... జూమ్‌

Friday 7th February 2020

4 శాతం ఎగసిన మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌ 52 వారాల గరిష్టానికి యునైటెడ్‌ స్పిరిట్స్‌ వరుసగా నాలుగు రోజులపాటు దూకుడు చూపిన దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. స్వల్ప ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. మధ్యాహ్నం 1.15 ప్రాంతంలో సెన్సెక్స్‌ 157 పాయింట్లు క్షీణించి 41,149కు చేరగా.. నిఫ్టీ 38 పాయింట్లు తక్కువగా 12,100 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఫార్మా

ట్రెంట్‌- అరబిందో.. ఒకటే జోరు!

Friday 7th February 2020

క్యూ3 ఫలితాల ఎఫెక్ట్‌ 7 శాతం జంప్‌చేసిన షేర్లు వరుసగా నాలుగు రోజులపాటు దూకుడు చూపిన దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. స్వల్ప ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. మధ్యాహ్నం 12 ప్రాంతంలో సెన్సెక్స్‌ 112 పాయింట్లు క్షీణించి 41,140కు చేరగా.. నిఫ్టీ 27 పాయింట్లు తక్కువగా 12,111 వద్ద ట్రేడవుతోంది. ఈ  నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో అటు రిటైల్‌ రంగ టాటా గ్రూప్‌

Most from this category