News


చైనాలో 5జీ సేవలు షురూ

Friday 1st November 2019
Markets_main1572579051.png-29269

  • సర్వీసులు ప్రారంభించిన 3 టెల్కోలు

బీజింగ్‌: టెక్నాలజీ వినియోగంలో అమెరికాను అధిగమించే క్రమంలో చైనా తాజాగా 5జీ టెలికం సేవలు ప్రారంభించింది. చైనాకు చెందిన మూడు దిగ్గజ టెల్కోలు గురువారం ఈ సర్వీసులు ప్రారంభించాయి. బీజింగ్‌, షాంఘై తదితర 50 నగరాల్లో తమ 5జీ సేవలు అందుబాటులో ఉంటాయని చైనా మొబైల్‌ సంస్థ వెల్లడించింది. ప్యాకేజీలు నెలకు 128 యువాన్ల నుంచి (18 డాలర్లు) ప్రారంభమవుతాయని పేర్కొంది. అటు పోటీ సంస్థలైన చైనా టెలికం, చైనా యూనికామ్ కూడా ఇదే స్థాయి టారిఫ్‌లతో సర్వీసులు అందిస్తున్నట్లు ప్రకటించాయి. ప్రస్తుతం ఉన్న 4జీ నెట్‌వర్క్‌లతో పోలిస్తే 100 రెట్లు వేగంగా ఉండే 5జీ సేవలతో సెకన్ల వ్యవధిలోనే పూర్తి నిడివి సినిమాను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డ్రైవర్‌రహిత కార్లు, ఫ్యాక్టరీల్లో ఆటోమేషన్‌ వంటి వాటికి ఇవి ఉపయోగపడనున్నాయి. 
    వచ్చే ఏడాది నాటికి 17 కోట్ల మంది యూజర్లతో 5జీ వినియోగంలో చైనా అగ్రస్థానంలో నిలుస్తుందని, సుమారు 75,000 మంది యూజర్లతో దక్షిణ కొరియా రెండో స్థానంలో.. 10,000 మంది వినియోగదారులతో అమెరికా మూడో స్థానంలో ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి. 5జీ పరికరాలు ఉత్పత్తిలో అగ్రగాములైన చైనా సంస్థలు హువావే, జెడ్‌టీఈలపై అమెరికా ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచ దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థలపై చైనా నిఘా పెట్టే విధంగా హువావే పరికరాలు ఉన్నాయని ఆరోపిస్తూ.. ఆ సంస్థను దూరంగా ఉంచాలంటూ యూరోపియన్ దేశాలపై అమెరికా ఒత్తిడి తెస్తోంది. You may be interested

చెరి 50 శాతం వాటాలు

Friday 1st November 2019

పీఎస్‌ఏ-ఫియట్‌ విలీన ప్రణాళిక వెల్లడి ప్యారిస్‌: ఫ్రాన్స్ ఆటోమొబైల్ దిగ్గజం పీఎస్‌ఏ, అమెరికా-ఇటాలియన్ వాహన తయారీ సంస్థ ఫియట్‌ క్రిస్లర్‌ (ఎఫ్‌సీఏ) సంస్థలు తమ విలీన ప్రతిపాదనను ఆవిష్కరించాయి. విలీనానంతరం నెదర్లాండ్స్ కేంద్రంగా మాతృసంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఇందులో రెండు సంస్థలకు చెరి 50 శాతం వాటాలు ఉంటాయి. విలీన కంపెనీకి మొత్తం 170 బిలియన్ యూరోల అమ్మకాలు, 11 బిలియన్ యూరోల నిర్వహణ లాభాలు

బంగారం వెల్లడికి ఎటువంటి పథకం లేదు

Friday 1st November 2019

కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి న్యూఢిల్లీ: ప్రభుత్వం బంగారానికి సంబంధించి ఎటువంటి క్షమాభిక్ష పథకాన్ని పరిశీలించడం లేదని కేంద్ర అధికార వర్గాలు స్పష్టం చేశాయి. లెక్కలు చూపని బంగారాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఓ స్వచ్చంద వెల్లడి పథకాన్ని త్వరలో కేంద్రం తీసుకురానుందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నిజానికి ఈ తరహా పథకం ఆదాయపన్ను శాఖ పరిశీలనలో లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. బడ్జెట్‌ ప్రక్రియ ఆరంభమైందని, సాధారణంగా బడ్జెట్‌

Most from this category