News


గో ఎయిర్‌ చౌక ధరలు

Wednesday 19th June 2019
Markets_main1560925975.png-26405

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: విమానయాన సంస్థ గో ఎయిర్‌ మినికేషన్‌ పేరుతో హైదరాబాద్‌ నుంచి పలు నగరాలకు టికెట్‌ ధరలను రూ.1,798 నుంచి ఆఫర్‌ చేస్తోంది. హైదరాబాద్‌ నుంచి అహ్మదాబాద్‌కు రూ.1,798, బెంగళూరు, లక్నో రూ.1,799, కోల్‌కత రూ.1,983, కొచ్చి రూ.2,499, ఢిల్లీకి రూ.2,599 చార్జీ చేస్తారు. బుకింగ్‌ పీరియడ్‌ జూన్‌ 18 నుంచి 23 వరకు ఉంది. జూలై 1 నుంచి సెప్టెంబరు 30లోగా కస్టమర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. గో ఎయిర్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. 



You may be interested

మెగా బీమా సంస్థ

Wednesday 19th June 2019

మూడు జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థల విలీన ప్రతిపాదన అటుపై న్యూ ఇండియా అష్యూరెన్స్‌తో కలయిక ఎల్‌ఐసీ తరహా దిగ్గజం ఏర్పాటుపై కేంద్రం కసరత్తు ఇక ప్రభుత్వ రంగంలో ఒకే సాధారణ బీమా సంస్థ న్యూఢిల్లీ: జీవిత బీమాకు సంబంధించి లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) తరహాలో... ప్రభుత్వ రంగంలోని సాధారణ బీమా సంస్థలన్నింటినీ కలిపి ఒకే దిగ్గజ సంస్థగా ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. న్యూ ఇండియా అష్యూరెన్స్‌ గొడుగు కిందికి మిగతా మూడింటినీ తెచ్చే

ఎన్‌సీఎల్‌టీ ముంగిట జెట్‌

Wednesday 19th June 2019

పిటీషన్ దాఖలు చేసిన బ్యాంకులు విచారణ బుధవారానికి వాయిదా ముంబై: దాదాపు రూ.8,500 కోట్ల రుణ బకాయిలను రాబట్టుకునే దిశగా ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌పై బ్యాంకులు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్‌సీఎల్‌టీ) ఆశ్రయించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సారథ్యంలోని 26 బ్యాంకులు మంగళవారం పిటీషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణను ట్రిబ్యునల్ బుధవారానికి వాయిదా వేసింది. రుణాలు, నష్టాల భారం పేరుకుపోవడంతో జెట్ ఎయిర్‌వేస్ ఏప్రిల్

Most from this category