News


మూడేళ్ల కనిష్టానికి టోకు ధరలు

Tuesday 15th October 2019
news_main1571112472.png-28881

  • సెప్టెంబర్‌లో 0.33 శాతం
  • ‘తయారీ’లో ధరల క్షీణత
  • ఇంధనం, విద్యుత్‌లోనూ ఇదే ధోరణి
  • ఆర్థిక మందగమనానికి సంకేతం

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం  తాజా గణాంకాలు ఆర్థిక వ్యవస్థలో మందగమనాన్ని సూచిస్తున్నాయి.  సెప్టెంబర్‌లో సూచీ 0.33 శాతంగా నమోదయ్యింది. మూడు సంవత్సరాల తర్వాత టోకు సూచీని ఈ స్థాయిలో చూడ్డం ఇదే తొలిసారి. 2016 జూన్‌లో టోకు ద్రవ్యోల్బణంలో అసలు పెరుగుదలలేకపోగా -0.1 శాతం క్షీణించింది. 2019 ఆగస్టులో టోకు ద్రవ్యోల్బణం 1.08 శాతంగా ఉంది. 2018 సెప్టెంబర్‌లో 5.22 శాతంగా ఉంది. తాజా సమీక్షా నెల సెప్టెంబర్‌ను చూస్తే, సూచీలో దాదాపు 60 శాతం పైగా వాటా కలిగిన తయారీ రంగం, అలాగే 20 శాతంగా ఉన్న  ఇంధనం, విద్యుత్‌ విభాగంలో ధరల పెరుగుదల అసలు లేదు. సోమవారం విడుదలైన అధికారిక గణాంకాలను చూస్తే...

మూడు విభాగాలూ ఇలా....
తయారీ: ఈ విభాగంలో 2019 సెప్టెంబర్‌లో టోకు ధరలు క్షీణతలో - 0.42  శాతంగా నమోదయ్యింది. 2018 సెప్టెంబర్‌లో ఈ పెరుగుదల రేటు 4.13 శాతంగా ఉంది.
ఫ్యూయెల్‌ అండ్‌ పవర్‌:  ఈ విభాగంలో ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం రేటు 17.30 శాతం నుంచి (2018 సెప్టెంబర్‌) -7.05 శాతానికి (ఆగస్టులో -4 శాతం) పడిపోయింది. 
ప్రైమరీ ఆర్టికల్స్‌: ఫుడ్‌, నాన్‌ ఫుడ్‌ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో మాత్రం రేటు 3.04 శాతం నుంచి 5.54 శాతానికి పెరిగింది. ఫుడ్‌ ఆర్టికల్స్‌లో ద్రవ్యోల్బణం రేటు -0.21 శాతం నుంచి 7.47 శాతానికి (ఆగస్టులో 7.47 శాతం) పెరిగింది. అయితే నాన్‌ ఫుడ్‌ ఆర్టికల్స్‌లో ద్రవ్యోల్బణం రేటు 3.51 శాతం నుంచి 2.18 శాతానికి తగ్గింది. 

సామాన్యునిపై రిటైల్‌ ధరాభారం
ఇక వ్యవస్థ మొత్తంలో డిమాండ్‌ తగ్గుతున్న పరిస్థితిని టోకు ధరల సూచిస్తుంటే, మరోవైపు సామాన్యునికి సంబంధించినంతవరకూ ధరల భారం తీవ్రతను వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం సూచిస్తోంది. రిటైల్‌ ధరల సూచీ సెప్టెంబర్‌లో ఏకంగా 3.99 శాతంగా నమోదయ్యింది. ఈ ధరల స్పీడ్‌ను 4 శాతంపైకి పెరగరానీయరాదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు కేంద్రం నిర్దేశిస్తోంది. ఈ హద్దుకు అతి స్వల్పదూరంలో మాత్రమే రిటైల్‌ ద్రవ్యోల్బణం రేటు ఉండడం గమనార్హం. ఆహార ధరలు పెరగడం దీనికి ప్రధాన కారణం. ఆర్‌బీఐ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 5.15 శాతం) నిర్ణయానికి రిటైల్‌ ద్రవ్యోల్బణాన్నే ప్రాతిపదికగా తీసుకోవడం జరుగుతోంది. ఈ రేటు పెరిగితే, రెపోరేటు కోత అవకాశాలు కూడా సన్నగిల్లుతాయి.  ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం- రిటైల్‌ విభాగంలోని మొత్తం ఐదు విభాగాలనూ చూస్తే... 

  • ఆహారం, పానీయాల విభాగంలో ద్రవ్యోల్బణ రేటు 4.7 శాతంగా ఉంది.  భారీగా ధరలు పెరిగిన నిత్యావసరాల్లో మాంసం, చేపలు (10.29 శాతం), కూరగాయలు (15.40 శాతం), పప్పు దినుసులు సంబంధిత ఉత్పత్తులు (8.40 శాతం) ఉన్నాయి. 
  • పాన్‌, పొగాకు ఇతర మత్తు ప్రేరిత విభాగంలో రేటు 4.59 శాతం.
  • దుస్తులు, పాదరక్షలకు సంబంధించి రిటైల్‌ ధరల స్పీడ్‌ 0.96 శాతంగా ఉంది. 
  • హౌసింగ్‌లో రేటు 4.75 శాతం.-
  • ఇక ఫ్యూయెల్‌ అండ్‌ లైట్‌ విభాగంలో రేటు -2.18 శాతంగా నమోదయ్యింది. You may be interested

5జీ వేలం ఈ ఏడాదే..

Tuesday 15th October 2019

స్పెక్ట్రం ధరల్లో సంస్కరణలు తీసుకొస్తాం... టెల్కోలకు మంత్రి రవి శంకర్ ప్రసాద్ భరోసా ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ప్రారంభం న్యూఢిల్లీ: 5జీ టెలికం సేవలకు అవసరమైన స్పెక్ట్రం వేలాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే నిర్వహించనున్నట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. స్పెక్ట్రం ధరలకు సంబంధించి సంస్కరణలు ఉంటాయని టెలికం పరిశ్రమకు హామీ ఇచ్చారు. సోమవారం ప్రారంభమైన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2019 సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ

21 పైసలు బలహీనపడిన రూపీ

Tuesday 15th October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో మంగళవారం ట్రేడింగ్‌లో 71.24 వద్ద ప్లాట్‌గా ప్రారంభమైంది. కాగా యుస్‌-చైనా మధ్య కుదిరిన పాక్షిక ఒప్పందం అమలుపై అనుమానాలు రేకత్తడంతో సోమవారం సెషన్‌లో ఇన్వెస్టర్లు రక్షణాత్మక ధోరణిని అనుసరించారు. ఫలితంగా గత సెషన్లో రూపీ డాలర్‌ మారకంలో 21 పైసలు బలహీనపడి 71.23 వద్ద ముగిసింది. గత సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో డాలర్‌-రూపీ అక్టోబర్‌ కాంట్రాక్ట్‌ 71.29 వద్ద ఉందని, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 1.02

Most from this category