News


9 శాతం వృద్ధి సవాలే: నీతి ఆయోగ్‌

Thursday 26th September 2019
news_main1569471262.png-28559

  • ఇంధన రంగానిదే కీలకమన్న
  • సీఈఓ అమితాబ్‌ కాంత్‌

న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 8 నుంచి 9 శాతం సాధించడం కేంద్రం ముందు ఉన్న ఒక సవాలని నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ పేర్కొన్నారు. వృద్ధి సాధన, అదే స్థాయిలో దానిని నిలబెట్టుకోవడం కీలకమని అన్నారు. ఆరేళ్ల కనిష్టస్థాయి 5 శాతానికి పడిపోయిన ఆర్థికాభివృద్ధి రేటును తిరిగి గాడిలో పెట్టడానికి కేంద్రం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కాంత్‌ తాజా ప్రకటన చేయడం గమనార్హం. మైనింగ్‌, జియోలాజికల్‌ అండ్‌ మెటలార్జికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎంజీఎంఐ) బుధవారం ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వచ్చే మూడు దశాబ్దాల్లో భారత్‌ అత్యున్నత స్థాయి వృద్ధి రేటు సాధించే స్థాయికి చేరాలంటే, అందులో ఇంధన రంగం కీలక పాత్ర పోషిస్తుందన్న విశ్లేషణ చేశారు. ఇంధన రంగం నిర్వహణ ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైనదని వివరించారు. తలసరి ఇంధన వినియోగం విషయంలో భారత్‌ ప్రస్తుతం ప్రపంచ సగటులో దాదాపు మూడవ వంతు (దాదాపు 33 శాతం) ఉందని పేర్కొన్న ఆయన, భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందాలంటే వినియోగం ఎన్నోరెట్లు పెరగాలని పేర్కొన్నారు. You may be interested

బ్యాంక్‌ షేర్ల ర్యాలీ..ఐసీఐసీఐ బ్యాంక్‌ 3 శాతం అప్‌

Thursday 26th September 2019

నేటితో (సెప్టెంబర్‌ 26, గురువారం) మార్కెట్‌లో సెప్టెంబర్‌ ప్యూచర్‌ అండ్‌ ఆప్సన్స్‌ కాంట్రాక్ట్‌ ముగియనుండడంతో మార్కెట్‌ పాజిటివ్‌గా ట్రేడవుతోంది. ఉదయం 10.09 సమయానికి నిఫ్టీ 105.30 పాయింట్లు లాభపడి 11,545.50 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 329.31 పాయింట్లు లాభపడి 38,923.44 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ లాభాలకు కారణమవుతున్న నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 499.50 పాయింట్లు లాభపడి 30047.50 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవీవెయిట్‌ షేర్లయిన ఐసీఐసీఐ

తొమ్మిది బ్యాంకులను మూసివేత... పుకార్లే!

Thursday 26th September 2019

ముంబై: తొమ్మిది వాణిజ్య బ్యాంకులు మూతపడబోతున్నాయంటూ...  సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని అటు కేంద్రం ఇటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బుధవారం స్పష్టం చేశాయి. వీటిలో ఏ మాత్రం నిజం లేదని ఫైనాన్స్‌ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. పైగా మరింత మూలధనం సమకూర్చి ప్రభుత్వ రంగ బ్యాంకులను పటిష్టం చేయడానికి కేంద్రం తగిన అన్ని ప్రయత్నాలూ చేస్తోందన్నారు. ఆర్‌బీఐ కూడా సోషల్‌ మీడియాలో

Most from this category