News


ఎస్‌బీఐ ఎండీగా తెలుగు వ్యక్తి

Thursday 23rd January 2020
news_main1579748959.png-31116

  •  బాధ్యతలు స్వీకరించిన చల్లా శ్రీనివాసులు శెట్టి

​​​​​​​హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కొత్త ఎండీగా చిత్తూరు జిల్లాకు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగేలా కేంద్రం ఆయన నియామకాన్ని ఖరారు చేయటంతో... మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించినట్లు బ్యాంకు ఒక ప్రకటనలో తెలియజేసింది. గతంలో ఈయన ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు. 1988లో అహ్మదాబాద్‌ ఎస్‌బీఐలో ప్రొబెషనరీ అధికారిగా ఉద్యోగంలో చేరిన శ్రీనివాసులుకు వ్యవసాయమంటే ఎంతో ఇష్టం. దానికి తగ్గట్టే ఆయన హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో (ప్రస్తుతం ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్సిటీ) వ్యవసాయ విద్యను అభ్యసించారు. అయితే ఆ తరవాత అనుకోకుండా బ్యాంకింగ్‌ రంగంలో అడుగు పెట్టి అక్కడే స్థిరపడ్డారు. ఎస్‌బీఐలో వివిధ హోదాల్లో పనిచేసిన శ్రీనివాసులు... వృత్తి రీత్యా గతంలో కొన్నాళ్లపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు. 



You may be interested

పదేళ్లలో 6 రెట్లు పెరిగిన టీసీఎస్‌ బ్రాండ్‌ విలువ

Thursday 23rd January 2020

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) బ్రాండ్ విలువ 2010- 2019 మధ్య కాలంలో ఏకంగా ఆరు రెట్లు పెరిగి 13.5 బిలియన్ డాలర్లకు చేరింది. బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసిన 2020 గ్లోబల్ 500 నివేదికలో ఈ అంశాలు వెల్లడైనట్లు టీసీఎస్ ఒక ప్రటనలో తెలియజేసింది. అలాగే సంస్థ సీఈవో రాజేష్ గోపీనాథన్ వరుసగా రెండోసారి టాప్ 100 గ్లోబల్ సీఈవోల జాబితాలో చోటు దక్కించుకున్నట్లు

జీఎంఆర్‌ పోర్టు అదానీ చేతికి!

Thursday 23rd January 2020

హైదరాబాద్‌: అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ ఆంధ్రప్రదేశ్‌లో మరో డీల్‌కు సిద్ధమైందని సమాచారం. కాకినాడలో నిర్మాణంలో ఉన్న కమర్షియల్‌ పోర్టుతోపాటు తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలోని కోన గ్రామంలో ఉన్న సెజ్‌ను జీఎంఆర్‌ గ్రూప్‌ నుంచి కొనుగోలు చేయనుంది. ఎంత మొత్తానికి కొనుగోలు చేస్తున్నదీ త్వరలో వెల్లడి కానుంది. పోర్టు అభివృద్ధికే జీఎంఆర్‌ సుమారు రూ.3,000 కోట్లు ఖర్చు చేస్తోంది. కాకినాడ సెజ్‌ పరిధిలో 8,521

Most from this category