News


రాజీ లేని నాణ్యత వల్లే ఈ స్థాయి

Saturday 28th September 2019
news_main1569645692.png-28594

  • పదేళ్లలోనే భారతీ సిమెంట్‌కు అగ్రస్థాయి
  • సంస్థ ఛైర్‌ పర్సన్‌ వైఎస్‌ భారతి రెడ్డి వ్యాఖ్యలు

నల్లలింగాయపల్లె (కమలాపురం): వినియోగదారుల ఆశీర్వాదాలే వ్యాపారానికి పునాదులని భారతి సిమెంట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీసీసీపీఎల్‌) ఛైర్‌ పర్సన్‌ వైఎస్‌ భారతి రెడ్డి చెప్పారు. వైఎస్సార్‌ జిల్లా కమలాపురం మండలం నల్ల లింగాయపల్లెలో బీసీసీపీఎల్‌ 10వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బీసీసీపీఎల్‌ భాగస్వామ్య సంస్థ వికా (ఫ్రాన్స్‌) అధిపతి గై సిడోస్, సోఫి సిడోస్‌ దంపతులతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ తన మామ స్వర్గీయ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జిల్లా ప్రజలకు ఉపాధి చూపడంతో పాటు నిర్మాణ రంగంలో నాణ్యమైన సిమెంట్‌ అందించాలని సూచించారని, దీంతో వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి అప‍్పట్లో భారతి సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని చెప్పారు. రోజు రోజుకూ పెరుగుతున్న టెక్నాలజీని వినియోగిస్తూ నాణ్యతకు అగ్రాసనం వేస్తున్నామని చెప్పారు. రోబోటిక్‌ క్వాలిటీ, జర్మన్‌ టెక్నాలజీ, టెంపరింగ్‌ ప్యాకింగ్‌తో అందిస్తున్న నాణ్యమైన సిమెంట్‌ను వినియోగిస్తున్న వారి ఆశీర్వాదాలే కంపెనీకి పునాదులన్నారు. దక్షిణ భారత దేశంతో పాటు పలు ప్రాంతాల్లో భారతి సిమెంట్‌ వినియోగం బాగుందని, దేశంలో రెండో స్థానంలో ఉన్నామని చెప్పారు. ఈ సందర్భంగా పరిశ్రమ డైరెక్టర్లతో పాటు కార్మికులు, ఉద్యోగులు, మార్కెటింగ్‌ సిబ్బందిని ప్రశంసించారు. తమ కంపెనీలో 200 సంవత్సరాల అనుభవం ఉన్న ఫ్రాన్స్‌కు చెందిన వికా భాగస్వామ్యం కావటం  సంతోషంగా ఉందన్నారు. వికా అధినేత గై సిడోస్‌ మాట్లాడుతూ 1817 నుంచి తమ వంశం సిమెంట్‌ పరిశ్రమలు నిర్వహిస్తోందని, 10 ఏళ్లలో కంపెనీ ఉన‍్నత స్థాయికి ఎదగడం గర్వించదగ్గ విషయమని చెప్పారు. ఫ్యాక్టరీ సీఈఓ అనూప్‌ కుమార్‌ సక్సేనా, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సాయిరమేష్‌ , పరిశ్రమ ప్రతినిధులు హరీష్‌ కామర్తి, బాలాజీ, జేజే రెడ్డి, రవిందర్‌ రెడ్డి, పిట్రాకోలా తదితరులు మాట్లాడారు. You may be interested

టెక్‌ స్టార్ట్‌అప్స్‌లో ఫేస్‌బుక్‌ పెట్టుబడులు

Saturday 28th September 2019

- తాజాగా సోషల్‌ కామర్స్‌ ప్లాట్‌ఫాం ‘మీషో’లో పెట్టుబడి - మరిన్ని స్టార్ట్‌అప్స్‌ను అన్వేషిస్తున్నట్లు వెల్లడి న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌.. దేశీ టెక్నాలజీ స్టార్ట్‌అప్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వ్యూహాలను రచిస్తోంది. తాజాగా సోషల్‌ కామర్స్‌ ప్లాట్‌ఫాం ‘మీషో’లో తన తొలి పెట్టుబడిని పెట్టిన ఈ సంస్థ.. మరిన్ని స్టార్ట్‌అప్స్‌లో పెట్టుబడుల పరంపరాను కొనసాగించేందుకు సిద్దమైంది. ఈ విషయాన్ని సంస్థ భారత కార్యకలాపాల మేనేజింగ్‌ డైరెక్టర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌

చిక్కుల్లో లక్ష్మీ విలాస్‌ బ్యాంకు!

Saturday 28th September 2019

డైరెక్టర్లపై మోసపూరిత ఆరోపణలు ఢిల్లీలో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు న్యూఢిల్లీ: మరో ప్రైవేటు బ్యాంకులో ముసలం మొదలైంది. చెన్నై కేంద్రంగా దక్షిణాదిలో ప్రధానంగా కార్యకలాపాలు నిర్వహించే లక్ష్మీ విలాస్‌ బ్యాంకు ఆరోపణల్లో చిక్కుకుంది. బ్యాంకు బోర్డు డైరెక్టర్లకు వ్యతిరేకంగా మోసం, నేరపూరిత కుట్ర, నమ్మకద్రోహం అభియోగాలతో ఢిల్లీలో ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. ‘‘ఢిల్లీ పోలీసు విభాగంలోని ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం 2019 సెప్టెంబర్‌ 23న ఎల్‌వీబీ బోర్డు డైరెక్టర్లు, తదితరులపై మోసం, విశ్వాస ఘాతుకం,

Most from this category