News


ఆర్‌కామ్‌కు రూ.104 కోట్లు తిరిగి ఇచ్చేయండి

Wednesday 8th January 2020
news_main1578456305.png-30754

  • కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: సంక్షోభంలో ఉ‍న్న రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌)కు స్వల్ప ఉపశమనం లభించింది. రూ.104 కోట్లను ఆర్‌కామ్‌కు తిరిగి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆర్‌కామ్‌కు రూ.104.34 కోట్లు తిరిగి చెల్లించాలంటూ టెలికం వివాదాల పరిష్కార అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (టీడీశాట్‌) గత డిసెంబర్‌ 21న ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను తాజాగా సుప్రీంకోర్టు సమర్థించింది. స్పెక్ట్రమ్‌ సంబంధిత చెల్లింపుల్లో వరుసగా విఫలవడమే కాకుండా, దివాలా చర్యలను ఎదుర్కొంటున్నందున ఆర్‌కామ్‌కు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదన్న టెలికం శాఖ వాదనను.. జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌, జస్టిస్‌ ఎస్‌ రవీంద్ర భట్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. స్పెక్ట్రమ్‌ చెల్లింపుల్లో ఆర్‌కామ్‌ విఫలం కావడంతో కంపెనీ సమర్పించిన బ్యాంకు గ్యారంటీలను టెలికం శాఖ నగదుగా మార్చుకుంది. రూ.774 కోట్లకు గాను రూ.909 కోట్లను ఇలా జమ చేసేసుకుంది. రూ.134.66 కోట్లను తిరిగి ఇవ్వాలంటూ ఆర్‌కామ్‌ కోరగా, టీడీ శాట్‌ రూ.104.34 కోట్లను అనుమతించడం గమనార్హం. 



You may be interested

72 దిగువకు రూ’పాయ్‌

Wednesday 8th January 2020

ఇరాన్‌ దాడుల ఎఫెక్ట్‌ ప్రారంభంలోనే 20 పైసలు డౌన్‌ ముందుగా హెచ్చరించిన విధంగా ఇరాక్‌లోని అమెరికన్‌ సైనిక స్థావరాలపై మిసైళ్లతో ఇరాన్‌ తాజాగా దాడులు చేయడంతో దేశీ కరెన్సీకి మరోసారి దెబ్బ తగిలింది. దీంతో ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో మారకంలో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే రూపాయి 20 పైసలు నీరసించింది. 72.02 వద్ద మొదలైంది. వెరసి రెండు రోజుల వ్యవధిలోనే తిరిగి సాంకేతికంగా కీలకమైన 72 మార్క్‌ దిగువకు చేరింది. ప్రస్తుతం 18 పైసలు(0.25

పన్ను చెల్లింపుదారులకు వేధింపులుండవు

Wednesday 8th January 2020

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీ: పన్నుల వ్యవస్థను సులభతరంగా మార్చేందుకు, నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి వేధింపుల్లేకుండా చేసేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అఖిల భారత వర్తక సమాఖ్య (సీఏఐటీ) మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతారామన్‌ పాల్గొని మాట్లాడారు. జీఎస్‌టీ రిటర్నుల దాఖలును మరింత మెరుగ్గా మార్చే దిశగా సూచనలను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని

Most from this category