News


సెయిల్‌లో 5 శాతం వాటా విక్రయం !

Monday 10th February 2020
news_main1581305239.png-31637

  • ఓఎఫ్‌ఎస్‌ మార్గంలో విక్రయించనున్న కేంద్రం 
  • రూ.1,000 కోట్లు సమీకరణ 

న్యూఢిల్లీ: సెయిల్‌(స్టీల్‌ అధారిటీ ఆఫ్‌ ఇండియా)లో 5 శాతం వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో ఈ వాటా షేర్లను విక్రయించాలనేది ప్రభుత్వ భావన. ఈ వాటా విక్రయం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ.1,000 కోట్లు సమకూరుతాయని అంచనా. ఈ వాటా విక్రయానికి సంబంధించిన రోడ్‌షోలను సింగపూర్‌, హాంగ్‌కాంగ్‌ల్లో నిర్వహించాలని దీపమ్‌, ఉక్కు శాఖలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.  కరోనా వైరస్‌ ప్రబలడంతో హాంగ్‌కాంగ్‌ రోడ్‌షో వాయిదా పడే అవకాశాలున్నాయి. 


మార్చిలోపు సెయిల్‌ వాటా విక్రయం....
సెయిల్‌ కంపెనీలో ప్రస్తుతం కేంద్రానికి 75 శాతం మేర వాటా ఉంది. 2014, డిసెంబర్‌లో ఈ కంపెనీలో 5 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం విక్రయించింది. సవరించిన అంచనాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం(డిజిన్వెస్ట్‌మెంట్‌) ‍ద్వారా రూ.65,000 కోట్లు సమీకరించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం ఇప్పటిదాకా రూ.34,000 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. మరో నెలన్నర రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. అందుకే ఈ ఆర్థిక సంవత్సరంలోనే సెయిల్‌లో 5 శాతం వాటా విక్రయం ఉండొచ్చు. 

వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.2.10 లక్షల కోట్లు....
కాగా గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ కంపెనీలో 10 శాతం వాటాను కూడా ప్రభుత్వం విక్రయించనున్నది. ఈ వాటా విక్రయం ద్వారా రూ.200 కోట్లు వస్తాయని అంచనా. ఈ కంపెనీలో కేంద్రానికి ప్రస్తుతం 74.50 శాతం వాటా ఉంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం(2020-21)లో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.2.10 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది.ఎల్‌ఐసీలో 10 శాతం వాటా విక్రయం, ఐడీబీఐ బ్యాంక్‌లో ఎల్‌ఐసీ వాటా విక్రయం ద్వారానే రూ.90,000 కోట్లు సమకూరుతాయని అంచనా. 



You may be interested

రూ. 10వేల కోట్ల సమీకరణకు లైన్ క్లియర్‌

Monday 10th February 2020

(అప్‌డేటెడ్‌..) యస్ బ్యాంక్‌ ఈజీఎంలో షేర్‌హోల్డర్ల ఆమోదం న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యస్‌ బ్యాంక్ తాజాగా రూ. 10,000 కోట్ల నిధులు సమీకరించేందుకు, అధీకృత షేర్ క్యాపిటల్‌ను రూ. 800 కోట్ల నుంచి రూ. 1,100 కోట్లకు పెంచుకునేందుకు మార్గం సుగమమైంది. బ్యాంక్ అసాధారణ సర్వసభ్య సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు షేర్‌హోల్డర్లు ఆమోదం తెలిపారు. ఈ ప్రతిపాదనల ప్రకారం రూ. 2 ముఖవిలువ గల 450 కోట్ల ఈక్విటీ షేర్లతో రూ.

తక్షణ మద్దతుశ్రేణి 40,820-40.690

Monday 10th February 2020

తక్షణ మద్దతుశ్రేణి 40,820-40.690 కరోనా వైరస్‌ ప్రభావం, బడ్జెట్‌పై అంచనాలు నెరవేరకపోవడంతో భారత్‌ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూసినప్పటికీ.... గతవారం ప్రపంచ మార్కెట్ల వేగవంతమైన  ర్యాలీని ఇక్కడి ఈక్విటీలు కూడా అనుసరించాయి. ఈ మధ్యలో అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడ్‌, భారత రిజర్వ్‌బ్యాంక్‌ పాలసీ నిర్ణయాలు యథాతథంగా వుండటంతో  మార్కెట్లపై పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు.  పటిష్టమైన బుల్‌ మార్కెట్లో హఠాత్‌ పతనం సంభవించినపుడు, సాంకేతికంగా రిట్రేస్‌మెంట్‌ ర్యాలీలు కూడా బలంగానే  వస్తుంటాయి.

Most from this category