News


ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై కేంద్రం సమీక్ష

Saturday 29th February 2020
news_main1582950659.png-32178

న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమస్యల పరిష్కారంపై కేంద్రం దృష్టి సారించింది.  ఇందులో భాగంగా .. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సారథ్యంలోని ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ (పీఎంజీ) 17 ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పరిస్థితి సమీక్షించింది. దాదాపు 36 అవరోధాలను గుర్తించింది. వాటిని సత్వరం పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. సుమారు రూ. 32,910 కోట్లతో ఈ ప్రాజెక్టులు తలపెట్టినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. సమీక్షించిన వాటిల్లో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజం బీపీసీఎల్‌కు‍ రసాయని (మహారాష్ట్ర)లోని పెట్రోకెమికల్ ప్రాజెక్టు కూడా ఉన్నట్లు పేర్కొంది. పీఎంజీ ఇప్పటిదాకా దాదాపు రూ. 32 లక్షల కోట్ల పెట్టుబడులున్న 809 ప్రాజెక్టులకు సంబంధించి 3,500 అంశాలను పరిష్కరించినట్లు పేర్కొంది. ప్రస్తుతం సుమారు రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులతో తలపెట్టిన 260 ప్రాజెక్టుల విషయంలో 588 అంశాలను సమీక్షిస్తోందని వివరించింది.  



You may be interested

సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి పదవీ కాలం పొడిగింపు !

Saturday 29th February 2020

ఆరు నెలలు పొడిగింపు  న్యూఢిల్లీ: మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ చైర్మన్‌గా అజయ్‌ త్యాగీ పదవీకాలాన్ని కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించిందని సమాచారం. సెబీకి కొత్త చైర్మన్‌ ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ పాడిగింపును ఇచ్చిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 1984 బ్యాచ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ కేడర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ అయిన అజయ్‌ త్యాగి 2017, మార్చి 1న సెబీ చైర్మన్‌గా నియమితులయ్యారు. కాగా సెబీ చైర్మన్‌

భారీగా తగ్గిన బంగారం !

Saturday 29th February 2020

శుక్రవారం దేశీయంగా, అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లు పతనమైనప్పటికీ, మార్జిన్‌ కాల్స్‌ పెరగడంతో శనివారం బంగారం ధర పడిపోయింది.శుక్రవారం దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో గురువారం ముగింపుతో పోలిస్తే రూ.1200 తగ్గి 10 గ్రాముల పసిడి రూ.41,397 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే 55 డాలర్లు తగ్గి ఔన్స్‌ బంగారం ధర 1,585 డాలర్ల వద్ద ముగిసింది. (శుక్రవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)  

Most from this category