News


ఆర్‌బీఐకి సీఐసీ షోకాజ్ నోటీసు

Friday 6th December 2019
news_main1575603296.png-30083

  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కేసులో విచారణకు హాజరు కానందుకే

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తనిఖీ నివేదికల వెల్లడి వివాదానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్‌ (ఆర్‌బీఐ)కి కేంద్రీయ సమాచార కమిషన్ (సీఐసీ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ అంశంపై విచారణకు హాజరు కావాలన్న తమ ఆదేశాలను ఆర్‌బీఐ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీపీఐవో) తేలిగ్గా తీసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలు ఉల్లంఘించినందున .. సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం సెక్షన్ 20 (1) కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. 


    వివరాల్లోకి వెడితే.. 2011 నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో జరిపిన తనిఖీల వివరాలు వెల్లడించాలంటూ గిరీష్ మిత్తల్ అనే వ్యక్తి ఆర్‌టీఐ కింద ఆర్‌బీఐకి దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు అనుకూలంగా ఆర్‌బీఐ సీపీఐవో సూచనలు జారీ చేశారు. అయితే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కీలకమైన వ్యాపార వివరాలు వెల్లడి కావడం వల్ల సంస్థ ప్రయోజనాలు దెబ్బతింటాయని సీపీఐవోకి తెలిపింది. కానీ సీపీఐవో దాన్ని తోసిపుచ్చడంతో సీఐసీని ఆశ్రయించింది. ఇందుకు సంబంధించిన విచారణకు హాజరు కావాలంటూ సీఐసీ ఆదేశించినప్పటికీ.. ఆర్‌బీఐ సీపీఐవో గైర్హాజరయ్యారు. దీనిపై ఆగ్రహించిన సీఐసీ.. తాజాగా షోకాజ్ నోటీసు జారీ చేసింది. గతంలో కూడా ఆర్‌బీఐ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంది. ఆర్‌టీఐ అమలు నిబంధనలు పాటించడం లేదంటూ అప్పట్లో ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్ పటేల్‌కు కూడా సీఐసీ ఆదేశాలు జారీ చేసింది. You may be interested

బ్యాంకింగ్‌లో మరిన్ని రుణాల రైటాఫ్

Friday 6th December 2019

కేటాయింపులు పెరగడం, రికవరీ బలహీనంగా ఉండటమే కారణం ఫిచ్‌ రేటింగ్స్ నివేదిక న్యూఢిల్లీ: దేశీ బ్యాంకులు మరిన్ని రుణాలను రైటాఫ్ (ఖాతాల నుంచి తొలగింపు) చేయాల్సి రావొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ గురువారం పేర్కొంది. మొండిబాకీలకు జరపాల్సిన కేటాయింపుల పరిమాణం పెరుగుతుండటం, బాకీల రికవరీ అవకాశాలు బలహీనంగా ఉండటం వంటి అంశాలే ఇందుకు కారణమని వివరించింది. మొండిబాకీల్లో సుమారు 90 శాతం భాగం ప్రభుత్వ రంగ బ్యాంకులదే (పీఎస్‌బీ) ఉంటోంది. గడిచిన మూడేళ్లలో

'పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడి'గా నీరవ్ మోదీ

Friday 6th December 2019

ప్రకటించిన ముంబై కోర్టు ఆస్తుల జప్తునకు మార్గం సుగమం ముంబై: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ (పీఎన్‌బీ)కి దాదాపు 2 బిలియన్ డాలర్ల టోకరా వేసిన కేసులో వజ్రాభరణాల వ్యాపారవేత్త నీరవ్ మోదీని 'పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడి'గా (ఎఫ్‌ఈవో) ముంబై కోర్టు ప్రకటించింది. ఈ కేసును విచారణ చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్ధనతో ఈ మేరకు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణ జనవరి 10కి వాయిదా వేసింది.

Most from this category