News


సెంట్రల్‌ బ్యాంక్‌ ఆదాయం రూ.7,308 కోట్లు

Wednesday 29th January 2020
news_main1580273314.png-31289

  •  రూ.164 కోట్ల నికర లాభం 
  • స్వల్పంగా తగ్గిన మొండి బకాయిల ప్రభావం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో రూ.164 కోట్ల నికర లాభం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.681 కోట్ల నికర నష్టాలొచ్చాయని బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.6,356 కోట్ల నుంచి రూ.7,308 కోట్లకు పెరిగింది.
తగ్గిన మొండి భారం...
మొండి బకాయిలు స్వల్పంగా తగ్గాయి. గత క్యూ3లో 20.64 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 19.99 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 10.32 శాతం నుంచి 9.26 శాతానికి చేరాయి. విలువ పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు రూ.35,333 కోట్ల నుంచి రూ.33,259 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.15,605 కోట్ల నుంచి రూ.13,568 కోట్లకు తగ్గాయి. 
కేటాయింపులూ తగ్గాయ్‌...
గత క్యూ3లో రూ.1,996 కోట్లుగా ఉన్న మొండి బకాయిల కేటాయింంపులు ఈ క్యూ3లో రూ.380 కోట్లకు తగ్గాయి. మొత్తం కేటాయింపులు రూ.1,812 కోట్ల నుంచి రూ.1,250 కోట్లకు దిగివచ్చాయి. స్టాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, గత క్యూ3లో రూ.718 కోట్లు నికర నష్టాలు రాగా, ఈ క్యూ3లో రూ.155 కోట్ల నికర లాభం వచ్చింది. మొత్తం ఆదాయం రూ.6,329 కోట్ల నుంచి రూ.7,278 కోట్లకు పెరిగింది. 



You may be interested

క్యూ3 ఎఫెక్ట్‌- టాటా కాఫీ, కమిన్స్‌ స్పీడ్‌

Wednesday 29th January 2020

5 శాతం ఎగసిన షేర్లు లాభాల్లో మార్కెట్లు యాపిల్‌ ఇంక్‌ ఫలితాల జోష్‌తో మంగళవారం అమెరికా మార్కెట్లు లాభపడగా.. దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో రెండు రోజుల వరుస నష్టాలకు చెక్‌పెడుతూ.. లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10.30 ప్రాంతం‍లో సెన్సెక్స్‌ 247 పాయింట్లు ఎగసి 41,214ను తాకగా.. నిఫ్టీ 80 పాయింట్లు బలపడి 12,136 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఓవైపు

మారుతీ లాభం రూ.1,587 కోట్లు

Wednesday 29th January 2020

(అప్‌డేటెడ్‌...) 4 శాతం వృద్ధి  రూ.20,722 కోట్లకు ఆదాయం  2 శాతం పెరిగిన వాహన విక్రయాలు న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో ​‍తైమాసిక కాలంలో 4 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.1,525 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.1,587 కోట్లకు పెరిగిందని మారుతీ సుజుకీ తెలియజేసింది. సేల్స్‌ ప్రమోషన్‌ వ్యయాలు అధికంగా ఉండటం, అధిక తరుగుదల,

Most from this category