News


సీబీహెచ్ఎఫ్ఎల్‌లో 'సెంట్రల్ బ్యాంక్‌' వాటాల విక్రయం

Monday 24th February 2020
news_main1582512583.png-32021

  • మర్చంట్ బ్యాంకర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

ముంబై: గృహ రుణాల వ్యాపార విభాగం సెంట్ బ్యాంక్ హోమ్ ఫైనాన్స్ (సీబీహెచ్‌ఎఫ్‌ఎల్‌)లో మొత్తం 64.4 శాతం వాటాల విక్రయంపై ప్రభుత్వ రంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ కోసం మర్చంట్ బ్యాంకర్లను ఆహ్వానిస్తూ ప్రకటన చేసింది. షార్ట్‌లిస్ట్ అయిన సంస్థలు.. సీబీహెచ్ఎఫ్ఎల్‌లో సెంట్రల్ బ్యాంక్ వాటాలకు కొనుగోలుదారును వెతికిపెట్టాల్సి ఉంటుంది. "మా బ్యాంకు కూడా స్వయంగా గృహ రుణాలు అందిస్తోంది. కాబట్టి ప్రత్యేకంగా హౌసింగ్ ఫైనాన్స్ అనుబంధ సంస్థలోనూ కొనసాగడం అనవసరమని భావిస్తున్నాం. అందుకే సెంట్ బ్యాంక్ హోమ్ ఫైనాన్స్ నుంచి మేం వైదొలగాలని భావిస్తున్నాం" అని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ పల్లవ్ మహాపాత్ర తెలిపారు. మర్చంట్ బ్యాంకర్ల ఎంపిక పూర్తయ్యాక, వాటాల విలువు మదింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ఎంత మేర నిధులు రాగలవన్నది అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. అయితే, డిపాజిట్లు కూడా స్వీకరించేందుకు అనుమతులున్నందున మిగతా నాన్‌-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలతో పోలిస్తే సీపీహెచ్ఎఫ్ఎల్‌కు మంచి వేల్యుయేషన్ రాగలదని ఆశిస్తున్నట్లు మహాపాత్ర చెప్పారు. అటు ఇండో జాంబియా బ్యాంకులో తమకున్న 20 శాతం వాటాలను భాగస్వామ్య సంస్థలు బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడాలకు విక్రయించే ప్రతిపాదనలపై కూడా చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. 

  •     సీబీహెచ్‌ఎఫ్‌ఎల్‌లో సెంట్రల్ బ్యాంక్‌కు 64.40 శాతం వాటాలు ఉండగా, మిగతాది హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో), యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (యూటీఐ), నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ)లకు ఉన్నాయి. 2016లోనూ సీబీహెచ్ఎఫ్ఎల్‌లో వాటాలు విక్రయించేందుకు సెంట్రల్ బ్యాంక్ ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. అప్పటి గణాంకాల ప్రకారం వీటి విలువ సుమారు రూ. 250 కోట్లు ఉండేదని అంచనా. 



You may be interested

త్వరలోనే టీహెచ్‌డీసీలో డిజిన్వెస్ట్‌మెంట్‌

Monday 24th February 2020

న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా టీహెచ్‌డీసీ ఇండియా, నార్త్ ఈస్టర్న్‌ ఎలక్ట్రిక్‌ పవర్ కార్పొరేషన్ (నీప్‌కో)లో వాటాలను మరో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్‌టీపీసీకి ఈ ఆర్థిక సంవత్సరంలోనే విక్రయించాలని కేంద్రం భావిస్తోంది. ఈ డీల్ ద్వారా ఖజానాకు దాదాపు రూ. 10,000 కోట్లు రావొచ్చని అంచనా. 2019-20 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ. 65,000 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని సాధించేందుకు ఇది తోడ్పడగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది

ద్రవ్యోల్బణాన్ని ఆర్‌బీఐ ఒక్కటే కట్టడి చేయలేదు: రంగరాజన్‌

Monday 24th February 2020

న్యూఢిల్లీ: ధరల పెరుగుదల (ద్రవ్యోల్బణం) సమస్యను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాత్రమే కట్టడి చేయలేదని మాజీ గవర్నర్‌ సీ రంగరాజన్‌ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ కట్టడిలో కీలకమైన సరఫరాలో సమస్యలను అధిగమించడంలో ప్రభుత్వానిదే కీలక పాత్ర అని ఆయన పేర్కొన్నారు. ‘నూతన ద్రవ్య విధాన ఫ్రేమ్‌వర్క్‌ - దాని అర్థం’’ అన్న చర్చాపత్రంపై ఆయన తన అభిప్రాయాలను వెలిబుచ్చుతూ, ద్రవ్యోల్బణం కట్టడిలో ఆర్‌బీఐ ద్రవ్య విధాన పరిమితుల గురించి

Most from this category