News


ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లపై సీసీఐ దర్యాప్తు

Tuesday 14th January 2020
news_main1578974716.png-30911

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లపై కాంపిటీషన్‌‌ కమిషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా (సీసీఐ) సోమవారం దర్యాప్తునకు ఆదేశించింది. భారీ డిస్కౌంట్లు, ఒక వస్తువు కొంటే మరోకటి పొందేలా ఆఫర్లు, ఎంపిక చేసిన అమ్మకందారులు మాత్రమే ప్లాట్‌ఫామ్‌లలో విక్రయాలు జరపడం వంటి అంశాల్లో ఈ సంస్థలు దుర్వినియోగానికి పాల్పడట్లు ఆరోపణలు వచ్చినట్లు సీసీఐ వెల్లడించింది. ఢిల్లీ వ్యాపార్ మహాసంఘ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపింది. ఈ అంశంపై స్పందించిన అమెజాన్‌.. తాము ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, దర్యాప్తును స్వాగతిస్తున్నామని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం సీసీఐ ఆర్డర్‌ను సమీక్షిస్తున్నామని ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది.You may be interested

బీఈఈఆర్‌ నిష్పత్తి బాగుంది... సూచీలు ముందుకే!

Tuesday 14th January 2020

ఇండెక్స్‌ కదలికలను సూచించే నిష్పత్తి బీర్‌ నిష్పత్తి(బీఈఈఆర్‌- బాండ్‌ ఎర్నింగ్‌ ఈల్డ్‌ రేషియో) సుముఖంగా ఉన్నందున దేశీయ మార్కెట్లో పాజిటివ్‌ కదలికలే కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో నిఫ్టీలో అధిక పీఈ విలువ మరికొంత కాలం కొనసాగవచ్చంటున్నారు. పదేళ్ల ప్రభుత్వ బాండ్‌ ఈల్డ్‌కు, సూచీల ఎర్నింగ్‌ ఈల్డ్‌కు మధ్య నిష్పత్తిని బీఈఈఆర్‌ అంటారు. బాండ్స్‌ కన్నా ఈక్విటీలు ఇన్వెస్టర్లను ఎంత మేరకు ఆకర్షిస్తాయనే అంశాన్ని ఈ నిష్పత్తి తెలియజేస్తుంది. పదేళ్ల

వ్యాపార పునర్‌వ్యవస్థీకరణలో వాల్‌మార్ట్‌

Tuesday 14th January 2020

56 మందికి ఉద్వాసన లిస్టులో 8 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లు భారత్‌ నుంచి నిష్క్రమించే యోచన లేదని స్పష్టీకరణ న్యూఢిల్లీ:   పోటీ సంస్థలను దీటుగా ఎదుర్కొనే క్రమంలో రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌ తాజాగా భారత్‌లో వ్యాపార  కార్యకలాపాల పునర్‌వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 56 మంది ఉద్యోగులను తొలగించింది. వీరిలో 8 మంది టాప్ ఎగ్జిక్యూటివ్స్‌ ఉండగా, మిగతా వారిలో.. మధ్య స్థాయి, కింది స్థాయి ఉద్యోగులు ఉన్నారు. ఉద్వాసనకు గురైన

Most from this category