News


ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 6 లక్షల కోట్లు

Friday 15th November 2019
news_main1573788844.png-29602

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ.6 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పన్నులు వసూలైనట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ పీసీ మోదీ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ.13.35 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యంలో ఇది సగానికన్నా తక్కువ. అయినప్పటికీ బడ్జెట్‌లో నిర్దేశిత లక్ష్యాలను సాధించగలమని మోదీ ధీమా వ్యక్తం చేశారు. సత్వరం రీఫండ్స్ చేస్తున్నామని, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి రీఫండ్స్ 20 శాతం పెరిగాయని ఆయన చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించడంపైనా దృష్టి పెట్టామని తెలిపారు. 



You may be interested

జీఎస్‌టీ వార్షిక రిటర్నుల గడువు తేదీ పొడగింపు

Friday 15th November 2019

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను పరిధిలోని ట్యాక్స్‌ పేయర్లకు ఊరట లభించింది. జీఎస్‌టీ వార్షిక రిటర్న్స్‌ (జీఎస్‌టీఆర్‌–9) దాఖలు చేయడానికి గడువు తేదీలను కేంద్రం పొడిగించింది. 2017-18 రిటర్నులను దాఖలు చేయడానికి ఈ ఏడాది డిసెంబర్‌ 31 గడువు తేదీ కాగా, 2018-19 రిటర్నుల చివరి తేదీ వచ్చే ఏడాది మార్చి 31గా ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా సమన్వయ నివేదిక (రికన్సిలియేషన్‌ స్టేట్‌మెంట్‌) దాఖలు తేదీల్లో కూడా మార్పులు చేసింది.

ఉద్యోగంలో సంతృప్తి.. కానీ, వేతనంపైనే..

Friday 15th November 2019

మాన్‌స్టర్‌ వేతన సూచీలో ఆసక్తికర విషయాలు ముంబై: వేతన జీవులు తాము చేస్తున్న ఉద్యోగం పట్ల సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ, తాము పొందుతున్న వేతనం విషయంలో మాత్రం అంత సంతోషంగా లేరని ‘మాన్‌స్టర్‌ వేతన సూచీ’ నివేదిక పేర్కొంది. తాము చేస్తున్న ఉద్యోగం పట్ల 75 శాతం మంది సంతృప్తికరంగా ఉన్నారు. కానీ, చెల్లింపుల పట్ల సంతోషం కనిష్ట స్థాయికి చేరిందని, 21.6 శాతం తగ్గిందని ఈ నివేదిక తెలిపింది. 2016

Most from this category