News


రూ.11.7 లక్షల కోట్ల పన్నుల లక్ష్యాన్ని సాధిస్తాం: సీబీడీటీ

Thursday 6th February 2020
news_main1580963165.png-31551

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యం రూ.11.7 లక్షల కోట్లను సాధించగమలన్న విశ్వాసాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీడీడీటీ) చైర్మన్‌ పీసీ మోదీ వ్యక్తం చేశారు. డేటా మైనింగ్‌ (సమాచారాన్ని వెలికితీయడం), కృత్రిమ మేథ (ఏఐ)ను ఆదాయం పెంచుకునేందుకు వినియోగిస్తున్నామే తప్ప, చర్యల కోసం కాదన్నారు. బడ్జెట్‌పై సీఐఐ ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీసీ మోదీ పాల్గొని మాట్లాడారు. ఇప్పటి వరకు పన్నుల ఆదాయ వసూళ్లు మంచిగానే ఉన్నాయని, గత త్రైమాసికంలో పన్నుల వసూళ్లు గరిష్ట స్థాయికి చేరినట్టు చెప్పారు. 2019-20కు సవరించిన పన్నుల వసూళ్ల లక్ష్యంలో ఆదాయపన్ను వసూళ్లు రూ.5.59 లక్షలుగా అంచనా వేయగా, కార్పొరేట్‌ పన్ను వసూళ్ల అంచనా రూ.6.10 లక్షల కోట్లుగా ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో  పన్నుల వసూళ్ల లక్ష్యంపై పీసీ మోదీ స్పందిస్తూ.. టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగించుకోవడం ద్వారా, స్వచ్చందంగా పన్ను చెల్లించేందుకు ముందుకు వచ్చేలా ప్రోత్సహించనున్నట్టు తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆదాయపన్ను ద్వారా రూ.6.38 లక్షల కోట్లు, కార్పొరేట్‌ పన్ను రూపంలో రూ.6.81 లక్షల కోట్లు సమకూర్చుకోవాలన్న లక్ష్యాన్ని బడ్జెట్లో ప్రభుత్వం నిర్దేశించుకుంది. You may be interested

మూడింతలైన హెచ్‌పీసీఎల్‌ నికర లాభం

Thursday 6th February 2020

ఇన్వెంటరీ లాభాల వల్లే  రూ.74,288 కోట్లకు తగ్గిన టర్నోవర్‌ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ హిందుస్తాన్‌ పెట్రోలియమ్‌ కార్పొ(హెచ్‌పీసీఎల్‌) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) డిసెంబర్‌ క్వార్టర్‌లో మూడింతలైంది. గత క్యూ3లో రూ.248 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.747 కోట్లకు పెరిగిందని హెచ్‌పీసీఎల్‌ సీఎమ్‌డీ ముకేశ్‌ కె. సురానా వెల్లడించారు. గత క్యూ3లో రూ.3,465 కోట్ల ఇన్వెంటరీ నష్టాలు రాగా, ఈ క్యూ3లో రూ.343 కోట్ల ఇన్వెంటరీ లాభాలు

స్వల్పంగా తగ్గిన పసిడి

Thursday 6th February 2020

అధిక ధరల నేపథ్యంలో దేశీ జువెలర్లు, కొనుగోలు దారుల నుంచి డిమాండ్‌ తగ్గుతుండడంతో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. గురువారం ఎంసీఎక్స్‌లో నిన్నటి ధరలతో పోలిస్తే రూ.40 తగ్గి 10 గ్రాముల పసిడి ధర 40,098.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది, రూపాయి రికవరీ బలపడడం, చైనా వడ్డీ రేట్ల తగ్గింపు ప్రభావం పసిడిపై పడడంతో అంతర్జాతీయ మార్కెట్‌లోను బంగారం ధర తగ్గింది. నిన్నటితో పోలిస్తే 6 డాలర్లు తగ్గి 1,558

Most from this category