STOCKS

News


బాకీల వసూలు వేటలో బీఎస్‌ఎన్‌ఎల్‌

Monday 12th August 2019
news_main1565589428.png-27703

  • రూ. 3,000 కోట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు

న్యూఢిల్లీ: నిధుల సంక్షోభంలో ఉన్న ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రస్తుతం కార్పొరేట్ క్లయింట్ల నుంచి బాకీల వసూళ్ల పనిలో పడింది. దాదాపు రూ. 3,000 కోట్ల మేర పేరుకుపోయిన బకాయిల్లో సింహభాగం మొత్తాన్ని వచ్చే రెండు, మూడు నెలల్లో వసూలు చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని భావిస్తోంది. కంపెనీ సీఎండీ పి.కె. పుర్వార్ ఈ విషయాలు వెల్లడించారు. బీఎస్ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు జీతాలను కూడా సకాలంలో చెల్లించలేని పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పుర్వార్ వెల్లడించిన విషయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. "ఎంటర్‌ప్రైజ్ కస్టమర్స్‌ నుంచి దాదాపు రూ. 3,000 కోట్ల బకాయిలు రావాలి. వాటిని రాబట్టుకునేందుకు రోజువారీ చర్యలు మరింత ముమ్మరం చేశాం. కచ్చితంగా రాబట్టుంటాం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎప్పట్లోగా మొత్తం రికవర్ అవుతుందన్నది చెప్పడం కష్టమని, అయితే వచ్చే రెండు, మూడు నెలల్లో అధిక భాగాన్ని రాబట్టుకోగలమని తెలిపారు. మరోవైపు, భవంతులు మొదలైనవి లీజుకివ్వడం ద్వారా ఈ ఏడాది కనీసం రూ. 1,000 కోట్ల మేర అద్దెల రూపంలో ఆదాయాలను పెంచుకోవాలని బీఎస్‌ఎన్ఎల్ యోచిస్తోంది. గతంలో ఈ మొత్తం రూ. 200 కోట్లుగా ఉండేది. వీటితో పాటు అవుట్‌సోర్సింగ్ చేసిన కార్యకలాపాలను క్రమబద్ధీకరించుకోవడం ద్వారా ఏటా రూ. 200 కోట్లు ఆదా చేసుకోవాలని, విద్యుత్ బిల్లుల భారాన్ని 15 శాతం మేర తగ్గించుకోవాలని సంస్థ ప్రయత్నిస్తోంది. You may be interested

రియల్టీ సమస్యలపై కేంద్రం దృష్టి

Monday 12th August 2019

రియల్టర్లు, గృహ కొనుగోలుదారులతో ఆర్థిక మంత్రి భేటీ న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ఇటు రియల్టర్లు, అటు గృహ కొనుగోలుదారులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. నిధుల కొరత, డిమాండ్ మందగించడం, ప్రాజెక్టులు నిల్చిపోవడం తదితర సమస్యల గురించి వివరంగా చర్చించారు. తొలి సమావేశంలో రియల్టర్ల తరఫున పరిశ్రమ సమాఖ్యలైన క్రెడాయ్‌, నారెడ్కో

స్థూల ఆర్థికాంశాలే కీలకం.!

Monday 12th August 2019

ఈ వారంలో ట్రేడింగ్‌ 3 రోజులకే పరిమితం సోమ (బక్రీద్‌), గురు (స్వాతంత్ర్య దినోత్సవం) వారాల్లో మార్కెట్‌కు సెలవు ఎఫ్‌పీఐ ట్యాక్స్‌ అంశంపై దృష్టిసారించిన మార్కెట్‌ వర్గాలు జూన్‌లో 2 శాతం ఐఐపీ.. మంగళవారం ట్రేడింగ్‌పై ప్రభావం..! - సీపీఐ ద్రవ్యోల్బణం (సోమ), డబ్ల్యూపీఐ బుధవారం వెల్లడి ముంబై: గతవారం దేశీ ప్రధాన స్టాక్‌ సూచీలు ఒకటిన్నర శాతం వరకు లాభాలను నమోదుచేసి ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మెరుగుపరిచాయి. అంతక్రితం వరుసగా నాలుగు వారాల పాటు నష్టాల్లో ట్రేడయ్యి..

Most from this category