STOCKS

News


ఇన్‌ఫ్రా కోసమే డిజిన్వెస్ట్‌మెంట్ నిధులు..

Tuesday 4th February 2020
news_main1580786104.png-31480

  • ఫిక్కీ సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా సమీకరించిన నిధులను మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసమే వినియోగిస్తామని.. ద్రవ్య లోటును భర్తీ చేసుకునేందుకు కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థపై ఇది అనేక రకాలుగా సానుకూల ప్రభావం చూపగలదని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. "సమీకరించిన నిధులను ఏం చేయబోతున్నామన్నది స్పష్టంగా చెబుతున్నాం. మీ పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికలను తదనుగుణంగా రూపొందించుకోవడానికి దీనితో వెసులుబాటు లభిస్తుంది. ప్రైవేట్ రంగం ప్రభుత్వానికి తోడ్పడాలి. దానికి సమానంగా ప్రభుత్వం కూడా ప్రైవేట్ రంగానికి తోడ్పాటు అందిస్తుంది" అని ఆమె చెప్పారు. ఉదాహరణకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వైద్య పరికరాలపై విధించే సుంకాల ‍ద్వారా వచ్చే నిధులను.. మైరుగైన వై‍ద్య సదుపాయాల కల్పనకు వినియోగించనున్నట్లు మంత్రి వివరించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎకానమీకి ఊతమిచ్చేందుకు నిధులను విచ్చలవిడిగా ఖర్చు చేయరాదని ప్రభుత్వం నిర్ణయించుకుందని ఆమె స్పష్టం చేశారు. 



You may be interested

ఉద్యోగుల ప్రయోజనాలూ పరిరక్షిస్తాం

Tuesday 4th February 2020

అడ్డగోలుగా తీసివేయడం కుదరదు ఎయిరిండియా, బీపీసీఎల్ విక్రయాలపై కేంద్రం వివరణ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఎయిరిండియా, బీపీసీఎల్‌లో వాటాలను విక్రయించినప్పటికీ.. ఉద్యోగుల ప్రయోజనాలను కూడా పరిరక్షించే విధంగా షేర్ల విక్రయ ఒప్పందాల్లో నిబంధనలు ఉంటాయని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత తెలిపారు. కొనుగోలు చేసిన సంస్థలు.. అడ్డగోలుగా ఉద్యోగులను తొలగించేందుకు ఉండబోదని పేర్కొన్నారు. ఎయిరిండియా, బీపీసీఎల్‌ బిడ్డింగ్ ప్రక్రియ రెండు దశల్లో ఉంటుందని చెప్పారు. నష్టాలు,

అర్‌బీఐ వైపు అందరి చూపు

Tuesday 4th February 2020

ఆర్థిక సంవత్సరం చివరి భేటీ ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. 6వ తేదీ వరకూ ఈ సమావేశం జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-2020) చివరి, ఆరవ ద్వైమాసిక ఆర్‌బీఐ పాలసీ సమావేశం ఇది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మందగమనం, ద్రవ్యోల్బణం కట్టుతప్పడం వంటి ప్రతికూలతల నేపథ్యంలో తాజా సమావేశం జరుగుతోంది. ధరలూ

Most from this category