News


డిస్కౌంట్ల హోరు.. కార్ల విక్రయాల జోరు!

Saturday 14th December 2019
news_main1576307603.png-30227

డిసెంబర్‌లో పెరిగిన కార్ల విక్రయాలు
డిసెంబర్‌ చివరకు వస్తుండడంతో కార్ల కంపెనీలు తమ ఉత్పత్తులపై డిస్కౌంట్లను మరింత పెంచాయి. దీంతో ఈ నెల్లో కార్ల విక్రయాలు మరింత జోరందుకున్నాయి. దాదాపు 5- 15 శాతం మధ్య ఆయా కార్లకంపెనీలు తమ ఉత్పత్తులపై డిస్కౌంట్లు ఆఫర్‌ చేస్తున్నాయి. కొత్త ఉద్గార నిబంధనలు అమల్లోకి రానున్న సందర్భంగా ఇప్పటికే ఉత్పత్తి చేసిన బీఎస్‌4 వాహనాలను పూర్తిగా వదిలించుకునే యత్నంలో భాగంగా కార్ల కంపెనీలు ఇలా డిస్కౌంట్ల జోరు పెంచాయి. డిసెంబర్‌తో కంపెనీల ఆఫర్లు ముగియవచ్చని, జనవరి నుంచి అన్ని కంపెనీలు ధరలు పెంచవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అందువల్ల కొత్త వాహనాలు కొనదలిచినవాళ్లకి ఇది మంచి తరుణమని మారుతీ ఈడీ శశాంక్‌ సూచించారు. తమ బీఎస్‌4 స్టాక్‌ మొత్తాన్ని దాదాపు విక్రయించామని ఆయన చెప్పారు. ప్రస్తుతం డిస్కౌంట్స్‌ భారీగా ఇస్తున్నామని, నెల ముగిస్తే ఇవేవి ఉండవని తెలిపారు. జనవరి నుంచి ధరలు పెంచక తప్పదన్నారు. సాధారణంగా ప్రతి డిసెంబర్‌లో ఆటో కంపెనీలు డిస్కౌంట్లు ఇస్తుంటాయి. కానీ ఈ దఫా ఇవి ఎక్కువయ్యాయి. గతేడాది మొత్తం ఆటోవిక్రయాల్లో డిసెంబర్‌ విక్రయాల వాటా 8 శాతంగా నమోదయింది.

ప్రస్తుతం మారుతీ తన వాహనాలపై రూ. 37-89వేల మేర డిస్కౌంట్‌ ఇస్తోంది. హుండాయ్‌ రూ. 20000నుంచి రూ.2 లక్షల రేంజ్‌లో ఆఫర్లు ప్రకటించింది. టాటా మోటర్స్‌ రూ. 77500 నుంచి రూ. 2.25 లక్షల మేర డిస్కౌంట్స్‌ ఇస్తోంది. ఈ ఏడాదిలో ఆటో కంపెనీలు ఇచ్చిన డిస్కౌంట్లలో ప్రస్తుతం ఇస్తున్నవే చాలా ఎక్కువ డిస్కౌంట్లని హుండాయ్‌ మోటర్స్‌ తెలిపింది. అయితే ఇప్పటికీ పలువురు కొనుగోలుదార్లు మరికొంత కాలం వేచిచూడాలని భావిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. టూవీలర్స్‌ విభాగంలో 2017లో ఉద్గార నిబంధనల మార్పు సందర్భంగా వచ్చినట్లే కార్ల విక్రయాల్లో సైతం భారీ ఆఫర్లు వస్తాయని, ఇవన్నీ వచ్చే ఏప్రిల్‌లో ఉండొచ్చని కొందరి ఆలోచన. కానీ ఇప్పటికే చాలా కార్ల కంపెనీలు తమ బీఎస్‌4 నిల్వలు తగ్గించుకోవడం, బీఎస్‌6 వాహనాల ఉత్పత్తి పెంచడంతో వీళ్లు ఆశించినంతగా ఫైర్‌ సేల్‌ ఉండదని నిపుణుల అంచనా. 



You may be interested

ఫ్లాట్‌గా ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 14th December 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ శుక్రవారం ఫ్లాట్‌గా ముగిసింది. నిఫ్టీ ఫ్యూచర్స్ సూచీ ముగింపు(12142.35)తో పోలిస్తే 6డాలర్లు స్వల్ప లాభంతో 12,149 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఫ్యూచర్‌ 122 పాయింట్లు లాభపడ్డప్పటికీ.., రాత్రి అమెరికా సూచీల ఫ్లాట్‌ ముగింపు కారణంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ సైతం అదే ట్రెండ్‌ను అవలంభించింది. అంతర్జాతీయంగా, దేశీయంగా గానీ నేడు, రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకోకపోతే సోమవారం నిఫ్టీ సూచీ

పసిడికి కలిసొచ్చిన డాలర్‌ బలహీనత

Saturday 14th December 2019

డాలర్ బలహీనతకు తోడు బాండ్‌ ఈల్డ్స్‌ పతనంతో శుక్రవారం పసిడి ధర లాభంతో ముగిసింది. అమెరికాలో రాత్రి ఔన్స్‌ పసిడి ధర 9డాలర్లు 1,481.20 డాలర్ల వద్ద స్థిరపడింది. బ్రిటన్‌లో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఘనవిజయం సాధించింది. కన్జర్వేటివ్ పార్టీ యూరోపియన్‌ యూనియన్‌ నుంచి వైదొలిగేందుకు (బ్రెగ్జిట్‌)కు అనుకూలంగా ఉండటంతో డాలర్‌తో పోలిస్తే పౌండ్ విలువ మూడు శాతం పెరిగింది. ఈ ఏడాది మే నుంచి

Most from this category