News


వడ్డీరేటు తగ్గించిన కెనరాబ్యాంక్‌

Saturday 8th February 2020
news_main1581133360.png-31613

ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ ఓవర్‌నైట్‌, నెల, మూడు, ఆరు నెలల కాలానికి ఎంసీఎల్‌ఆర్‌ను 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. ఏడాది కాలానికి ఈ రేటు 15 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. ఫిబ్రవరి 7 నుంచీ తాజా రేటు అమల్లోకి వచ్చింది. దీనితో ఓవర్‌నైట్‌, నెల రేట్లు 7.65 శాతానికి తగ్గుతాయి. మూడు నెలల కాలానికి ఈ రేటు 7.95 శాతానికి తగ్గుతుంది. ఆరు నెలల కాలానికి 8.10 శాతం, ఏడాది కాలానికి 8.20 శాతం అమలవుతుంది. 



You may be interested

భారత్‌లో అమెజాన్‌ రూ. 2,500 కోట్ల పెట్టుబడి

Saturday 8th February 2020

న్యూఢిల్లీ: భారత్‌లో శరవేగంగా కార్యకలాపాలు విస్తరిస్తున్న అమెరికన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌.. తాజాగా మరో రూ. 2,500 కోట్లను ఇక్కడ పెట్టుబడిగా పెట్టింది. డేటా సర్వీసెస్ ఇండియా విభాగంలో రూ. 2,208 కోట్లు, సెల్లర్ సర్వీసెస్‌లో రూ.355 కోట్లను ఇన్వెస్ట్‌ చేసినట్లు నియంత్రణ సంస్థలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. భారత పర్యటనలో భాగంగా ఇక్కడ రూ. 7,000 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు కంపెనీ సీఈఓ జెఫ్ బెజోస్ ఇటీవలే ప్రకటించారు.

టెక్నో పెయింట్స్‌ మరింత కలర్‌ఫుల్‌

Saturday 8th February 2020

కంపెనీ నుంచి 1,800 నూతన రంగులు రూ.25 కోట్లతో మరో తయారీ కేంద్రం హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- పెయింట్స్‌ తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ టెక్నో పెయింట్స్‌ 1,800 రకాల కొత్త రంగులను పరిచయం చేసింది. వీటిలో యాంటీ బాక్టీరియల్‌, ఇన్‌ఫ్రారెడ్‌ రిఫ్లెక్టివ్‌ పెయింట్లు కూడా ఉన్నాయి. దిగ్గజ కంపెనీలకు ధీటుగా కలర్‌ స్పెక్ట్రాను రూపొందించింది. దీని ద్వారా నచ్చిన రంగులు ఎంచుకోవడానికి కస్టమర్లకు మరింత సులువు అవుతుందని టెక్నో పెయింట్స్‌ ఫౌండర్‌

Most from this category