News


పెరిగిన కెనరా బ్యాంక్‌ లాభం...షేరు 3 శాతం అప్‌

Wednesday 6th November 2019
Markets_main1573032677.png-29396

  • 3శాతానికి పైగా ర్యాలీ చేసిన షేరు 

మెండిబకాయిలకు  కేటాయింపులు తగ్గడం, ఇతర ఆదాయాలు పెరగడంతో కెనరా బ్యాంక్‌ సెప్టెంబర్‌ క్వార్టర్లో మెరుగైన పనితీరును కనబరిచింది. వార్షిక ప్రాతిపదికన రెండో త్రైమాసికంలో రూ.365 కోట్ల నికర లాభం సాధించింది. గతే ఆర్థిక సంవత్సరం ఇదే క్యూ2లో సాధించిన రూ.299.5 కోట్లతో పోలిస్తే ఇది 22శాతం అధికం. మొత్తం ఆదాయం 15.42శాతం వృద్ధితో రూ.15509.36 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే క్యూ2లో మొత్తం ఆదాయం రూ.13437.83 కోట్లుగా ఉంది.  వడ్డీయేతర ఆదాయం 33శాతం పెరిగి రూ.2,069.6 కోట్లను ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 4.6శాతం తగ్గి రూ.3,130కోట్లుగా నమోదైంది. రుణ వృద్ధి 4.8శాతం పెరిగింది. ఆస్తుల నాణ్యత మెరుగుపడటంతో స్థూల ఎన్‌పీఏలు 10.50శాతం నుంచి 8.50శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్‌ఏపీలు 6.54శాతం నుంచి 5.15శాతానికి తగ్గాయి. స్థూల డిపాజిట్లు 10.50శాతం వృద్ధితో రూ.6.09లక్షల కోట్లుగా నమోదయ్యాయి. త్రైమాసిక ప్రాతిపాదికన ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 68.62శాతం నుంచి 70.11శాతానికి పెరిగింది. ప్రీ-ప్రొవిజన్‌ ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ 9.3శాతం పెరిగి రూ.2,544.6 కోట్లకు చేరింది. 


క్యూ2 ఫలితాల అనంతరం కంపెనీ షేరు ధర 3.75శాతం ర్యాలీ చేసి రూ.214.55 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.3:00లకు షేరు క్రితం ముగింపు(రూ.206.75)తో పోలిస్తే 2.81శాతం లాభంతో రూ.212.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

ఉద్యోగుల తొలగింపు...కాగ్నిజెంట్‌ బాటలోనే ఇన్ఫోసిస్‌

Wednesday 6th November 2019

నికరంగా 7000 మంది మిడ్‌, సీనియర్‌ లెవల్‌ ఉద్యోగులకు ఉద్వాసన చెప్పనున్నట్లు ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ ప్రకటించిన కొద్దిరోజులకే మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కూడా అదే మార్గాన్ని అనుసరించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇన్ఫోసిస్, వివిధ స్థాయిలలో అంచనాలకు అనుగుణంగా పనిచేయని(ఇన్వాలంటరీ యాట్రిషన్‌) ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధపడుతోందని కంపెనీ వర్గాలు మంగళవారం తెలిపాయి. ‘అధిక పనితీరును కనబరిచే ఇన్ఫోసిస్‌ లాంటి కంపెనీలు, వ్యాపారాన్ని సమగ్రపరిచేందుకు ఇన్వాలంటరీ యాట్రిషన్‌ను వినియోగిస్తుంటాయి. ఏ స్థాయిలోనైనా

52వారాల గరిష్టానికి జీఎంఆర్‌

Wednesday 6th November 2019

మౌలిక రంగంలో సేవలను అందిచే జీఎంఆర్‌ షేరు మిడ్‌సెషన్‌ కల్లా ఏడాది 52వారాల గరిష్టాన్ని అందుకుంది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.20.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ కంపెనీ షేరు కొనుగోళ్ల మొగ్గుచూపడంతో ఒక దశలో దాదాపు 9శాతం లాభపడి రూ.22.45 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.1:45ని.లకు షేరు క్రితం ముగింపు ధర(రూ.20.65)తో పోలిస్తే 7.50శాతం లాభంతో రూ.22.15

Most from this category