News


కెనరా బ్యాంక్‌కు తగ్గిన మొండి బకాయిలు

Friday 24th January 2020
news_main1579835511.png-31150

  • 4 శాతం పెరిగిన నికర లాభం 

ముంబై: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక కాలంలో రూ.330 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం, రూ.318 కోట్లుతో పోల్చితే 4 శాతం వృద్ధి సాధించామని కెనరా బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.13,513 కోట్ల నుంచి రూ.14,002 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 

బ్యాంక్‌ రుణ నాణ్యత మెరుగుపడింది. మొండి బకాయిలు తగ్గాయి. గత క్యూ3లో 6.37 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 5.05 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 10.25 శాతం నుంచి 8.26 శాతానికి చేరాయి. విలువ పరంగా చూస్తే, నికర మొండి బకాయిలు రూ.26,591 కోట్ల నుంచి రూ.21,338 కోట్లకు తగ్గాయి. మొండి బకాయిలు తగ్గడంతో ఈ బ్యాంక్‌ కేటాయింపులు కూడా తగ్గాయి. గత క్యూ3లో రూ.1,977 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ3లో రూ.1,803 కోట్లకు తగ్గాయి. 



You may be interested

ఇక గోద్రేజ్‌ ఎయిర్‌ కూలర్లు

Friday 24th January 2020

3 కేటగిరీల్లో 17 మోడళ్లు  ధరలు రూ.12,300-19,900 రేంజ్‌లో  న్యూఢిల్లీ: గృహోపకరణాల సంస్థ, గోద్రేజ్‌ అప్లయెన్సెస్‌ ఎయిర్‌ కూలర్ల సెగ్మెంట్లోకి ​ప్రవేశించింది. ఇన్వర్టర్‌ టెక్నాలజీతో రూపొందిన ఎయిర్‌ కూలర్లను మార్కెట్లోకి తెచ్చామని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కమల్‌ నంది పేర్కొన్నారు. ఈ కూలర్ల వాడకం వల్ల విద్యుత్తు 50 శాతం అవుతుందని మూడేళ్లలో రూ.3,000 వరకూ పొదుపు చేయవచ్చని వివరించారు. మూడు కేటగిరీల్లో (ఇన్వెర్టర్‌, ఎలక్ట్రానిక్‌, మెకానికల్‌ సిరీస్‌) మొత్తం 17

హైదరాబాద్‌ వద్ద ‘యువిక్‌’ మరో ప్లాంటు

Friday 24th January 2020

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: అల్యూమినియం విండోస్‌, డోర్స్‌ తయారీలో ఉన్న యువిక్‌ బిల్డింగ్‌ మెటీరియల్స్‌ కొత్త ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌ సమీపంలోని శంకర్‌పల్లి వద్ద ఇది ఎనమిది నెలల్లో రానుంది. 10 ఎకరాల్లో నెలకొల్పనున్న ఈ ప్లాంటుకు రూ.12 కోట్ల దాకా వ్యయం చేస్తున్నట్టు యువిక్‌ ఎండీ తరుణ్‌ సందీప్‌ తెలిపారు. కంపెనీ ఈడీ చైతన్య బోయపాటి, వైకేకే ఏపీ డైరెక్టర్‌ మిచిషిత, బొరూకా ఎక్స్‌ట్రూషన్‌ డైరెక్టర్‌ రజత్‌ అగర్వాల్‌తో

Most from this category