News


కెనడా కంపెనీ చేతికి మహీంద్రా ఏఎమ్‌సీలో 49 శాతం వాటా

Saturday 22nd June 2019
news_main1561177773.png-26491

  • డీల్‌ విలువ 3.5 కోట్ల డాలర్లు 

ముంబై: మహీంద్రా ఫైనాన్స్‌ కంపెనీ తన అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలో 49 శాతం వాటాను కెనడా కంపెనీకి విక్రయించింది. మహీంద్రా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలో 49 శాతం వాటాను కెనడాకు చెందిన మ్యాన్‌యులైఫ్‌ కంపెనీ 3.5 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసిందని మహీంద్రా ఫైనాన్స్‌ తెలిపింది.  అలాగే మహీంద్రా ట్రస్టీ కంపెనీలో 49 శాతం వాటాను 10 క్షల డాలర్లకు కొనుగోలు చేసిందని వివరించింది.  మ్యాన్‌యులైఫ్‌తో భాగస్వామ్యం కారణంగా తమ మ్యూచువల్‌ ఫండ్‌ వ్యాపారం మరింత వృద్ధి చెందుతుందని మహీంద్రా ఫైనాన్స్‌ వైస్‌ చైర్మన్‌, ఎమ్‌డీ రమేశ్‌ అయ్యర్‌ పేర్కొన్నారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఫండ్స్‌ను మ్యాన్‌యులైఫ్‌ రూపొందిస్తుందని వివరించారు. వాటా విక్రయం ద్వారా వచ్చిన నిధులను మ్యూచువల్‌ ఫండ్‌ వ్యాపారంలోనే వినియోగిస్తామని పేర్కొన్నారు. తమపై ఎలాంటి లిక్విడిటీ సంబంధిత ఒత్తిడులు లేవని వివరించారు. 

ఈ ఏడాది మార్చి నాటికి మహీంద్రా ఏఎమ్‌సీ 1.6 లక్షల మంది వినియోగదారులతో, రూ.5,019 కోట్ల నిర్వహణ ఆస్తులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 



You may be interested

విధానం మార్పు రేట్ల కోటకు సంకేతమే

Saturday 22nd June 2019

నోమురా అంచనా ముంబై: ఆర్‌బీఐ తన విధానపరమైన వైఖరిని మార్చుకోవడం మరిన్ని రేట్ల కోత దిశగా సంకేతమేనని జపాన్‌ బ్రోకరేజీ సంస్థ నోమురా పేర్కొంది. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) గత సమావేశం వివరాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చింది. ఆర్‌బీఐ తన విధానాన్ని సర్దుబాటుకు మార్చుకోవడం అంటే సమీప భవిష్యత్తులో రేట్ల పెంపు లేదన్నట్టు అర్థం చేసుకోవాలని స్వయంగా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ చివరి సమావేశం తర్వాత ప్రకటించిన విషయాన్ని

రవాణా... రయ్‌..రయ్‌

Saturday 22nd June 2019

 15 లాజిస్టిక్‌ సంస్థలతో షిప్‌రాకెట్‌ ఒప్పందం 1.5 లక్షల మంది విక్రయదారుల నమోదు ఏటా 10 లక్షల డెలివరీ; రూ.348 కోట్ల జీఎంవీ త్వరలోనే పోస్టల్‌ విభాగంతో ఒప్పందం  ‘స్టార్టప్‌ డైరీ’తో కో–ఫౌండర్‌ సాహిల్‌ గోయల్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రిటైలర్, హోల్‌సేలర్ అనే తేడా లేదు ప్రతి ఒక్కరూ తమ వ్యాపారాన్ని ఆన్‌లైన్‌లోకి విస్తరించాలని భావిస్తున్నారు. మెట్రో నగరాల్లో అయితే ఓకే.. ఎందుకంటే అందుబాటులో లాజిస్టిక్‌ కంపెనీ సేవలుంటాయి కాబట్టి! మరి, గ్రామీణ ప్రాంతాల్లోని వ్యాపారస్తులు

Most from this category