STOCKS

News


సీసీడీ తాత్కాలిక చైర్మన్‌గా రంగనాథ్‌

Thursday 1st August 2019
news_main1564630583.png-27456

  • తాత్కాలిక సీవోవోగా నితిన్‌
  • కాఫీ డే ఎ౾ంటర్‌ప్రైజెస్ బోర్డు నిర్ణయాలు

న్యూఢిల్లీ: కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ (సీసీడీ) వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ మరణం నేపథ్యంలో తాత్కాలిక చైర్మన్‌గా స్వతంత్ర డైరెక్టర్ ఎస్‌వీ రంగనాథ్‌ నియమితులయ్యారు. నితిన్ బాగ్మానే తాత్కాలిక చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌ (సీవోవో)గా నియమితులయ్యారు. సిద్ధార్థ భార్య మాళవిక హెగ్డే డైరెక్టరుగా ఉన్న సీసీడీ బోర్డు బుధవారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రంగనాథ్‌, నితిన్ బాగ్మానే, సీఎఫ్‌వో ఆర్‌ రామ్మోహన్‌తో కలిపి ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కాఫీ డే గ్రూప్ రుణభారాన్ని తగ్గించేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలపై ఈ కమిటీ దృష్టి పెట్టనుంది. సిద్ధార్థ సోమవారం సాయంత్రం అదృశ్యమైన సంగతి తెలిసిందే. సుమారు 36 గంటల తర్వాత బుధవారం నేత్రావతి నదిలో ఆయన శవమై కనిపించారు. ఈ నేపథ్యంలోనే కంపెనీ నిర్వహణ గాడి తప్పకుండా తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం సీసీడీ బోర్డు సమావేశమైంది. బ్యాంకులు, ఇన్వెస్టర్లు, ఆదాయపు పన్ను శాఖ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఉన్నాయని సిద్ధార్థ రాసినట్లుగా తెరపైకి వచ్చిన లేఖలోని అంశాలు కూడా పరిశీలించాలని బోర్డు నిర్ణయించినట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు సీసీడీ తెలియజేసింది. ‘‘ఆ లేఖ స్వయంగా సిద్ధార్థ రాసినదేనా కాదా అన్నది తెలియాల్సి ఉంది. అలాగే అందులో ఆయన పేర్కొన్న అంశాలు కంపెనీపరమైనవా లేక వ్యక్తిగతమైన వ్యవహారాల గురించా అన్న దానిపై కూడా స్పష్టత లేదు. అయితే, లేఖలో పేర్కొన్న అంశాలన్నింటినీ నిశితంగా పరిశీలించాలని బోర్డు నిర్ణయించింది’’ అని పేర్కొంది. 



You may be interested

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Thursday 1st August 2019

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పొవెల్‌ చేసిన నిరుత్సాహకర వ్యాఖ్యలతో ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడటంతో భారత్‌ స్టాక్‌ సూచీలు గురువారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 150 పాయింట్ల నష్టంతో 37,330 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 60 పాయింట్ల గ్యాప్‌డౌన్‌తో 11,060 పాయింట్ల సమీపంలోనూ మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో వేదాంత, జీ టెలిఫిల్మ్‌, యస్‌బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌లు 1-2 శాతం మధ్య

వినయశీలి, మృదుభాషి: సిద్ధార్థకు కార్పొరేట్ల నివాళులు

Thursday 1st August 2019

వీజీ సిద్ధార్థ మృతిపై పరిశ్రమ దిగ్గజాలు సంతాపం వ్యక్తం చేశారు. ‘‘సిద్ధార్థ వినయశీలి, మృదుభాషి’’ అని బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్‌ షా, ఆటోమొబైల్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తదితరులు నివాళులర్పించారు. "సిద్ధార్థ భార్య మాళవిక, ఆయన కుమారులు, ఎస్‌ఎం కృష్ణ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాలు తెలియజేస్తున్నాను" అని కిరణ్ మజుందార్‌ షా మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో పేర్కొన్నారు. "సిద్ధార్థ గొప్ప

Most from this category