News


0.9 శాతానికి తగ్గిన కరెంటు ఖాతా లోటు

Wednesday 1st January 2020
news_main1577850194.png-30577

ముంబై: జీడీపీలో కరెంటు ఖాతా లోటు (క్యాడ్‌) సెప్టెంబర్‌ త్రైమాసికంలో 0.9 శాతానికి (6.3 బిలియన్‌ డాలర్లు) తగ్గినట్టు ఆర్‌బీఐ తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి క్యాడ్‌ 2.9 శాతంగా ఉండడం గమనార్హం. విదేశీ మారకం రూపంలో నిధుల రాక, పోకల మధ్య అంతరాన్ని క్యాడ్‌గా పేర్కొంటారు. వాణిజ్య లోటు తక్కువగా 38.1 బిలియన్‌ డాలర్లుగా ఉండడమే క్యాడ్‌ తగ్గేందుకు తోడ్పడినట్టు ఆర్‌బీఐ తెలిపింది. మరి క్రితం ఏడాది ఇదే కాలానికి వాణిజ్య లోటు 50 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగానికి (ఏప్రిల్‌-సెప్టెంబర్‌) క్యాడ్‌ జీడీపీలో 1.5 శాతంగా నమోదైంది. అంతక్రితం ఇదే కాలంలో 2.6 శాతంగా ఉంది. నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) సెప్టెంబర్‌ క్వార్టర్లో 7.4 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో నికర ఎఫ్‌డీఐలు 21.2 బిలియన్‌ డాలర్లుగా, పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు 7.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.  



You may be interested

బుధవారం వార్తల్లో షేర్లు(1-1-20)

Wednesday 1st January 2020

కొత్త ఏడాది సందర్భంగా దాదాపు ప్రపంచ స్టాక్‌ మార్కెట్లన్నీ సెలవులో కొనసాగుతున్నాయి. దీంతో నేడు దేశీయంగా యాక్టివిటీ తక్కువగా నమోదయ్యే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కొన్ని కంపెనీల కౌంటర్లు వార్తల కారణంగా ట్రేడర్లను, ఇన్వెస్టర్లను ఆకట్టుకునే వీలున్నట్లు చెబుతున్నారు. తాజాగా వార్తలలో నిలిచిన ఆయా కంపెనీల వివరాలు చూద్దాం.. యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ వాహత్‌ అల్‌ అమన్‌ హోమ్‌ హెల్త్‌కేర్‌లో వాటా కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఆరోగ్యపరిరక్షణ రంగ కంపెనీ యాస్టర్‌

మౌలిక రంగం డౌన్‌

Wednesday 1st January 2020

నవంబర్‌లో 1.5 శాతం క్షీణత న్యూఢిల్లీ: మౌలిక రంగంలోని ఎనిమిది కీలక పరిశ్రమల ఉత్పత్తి వరుసగా నాలుగో నెలా క్షీణించింది. 2019 నవంబర్‌లో వృద్ధి 1.5 శాతం తగ్గింది. 2018 నవంబర్‌లో ఈ ఎనిమిది పరిశ్రమలు 3.3 శాతం వృద్ధి నమోదు చేశాయి. తాజాగా ఎనిమిదింట అయిదు పరిశ్రమలు ప్రతికూల వృద్ధి నమోదు చేయడంతో మొత్తం గ్రూప్ వృద్ధి మందగించింది. నవంబర్‌లో బొగ్గు, క్రూడాయిల్‌, సహజ వాయువు, ఉక్కు, విద్యుత్‌ ఉత్పత్తి

Most from this category