News


ఐడీబీఐ బ్యాంక్‌కు రూ. 9,300 కోట్ల నిధులు

Wednesday 4th September 2019
news_main1567576971.png-28180

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకును గాడిన పెట్టే దిశగా రూ. 9,300 కోట్ల మేర నిధులు సమకూర్చనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్‌ వెల్లడించారు. బ్యాంకు మూలధన స్థాయిని పెంచేందుకు, లాభాల్లోకి మళ్లించేందుకు ఇది తోడ్పడగలదని పేర్కొన్నారు. ఇందులో సుమారు 51 శాతం నిధులను (రూ. 4,743 కోట్లు) ఎల్‌ఐసీ సమకూర్చనుండగా, మిగతా 49 శాతం (రూ. 4,557 కోట్లు) కేంద్రం వన్‌-టైమ్ ప్రాతిపదికన అందించనుంది. మొండిబాకీలతో కుదేలైన ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీ గత ఆగస్టులో తన వాటాలను 51 శాతానికి పెంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అదనపు మూలధనం లభించడంతో ఐడీబీఐ బ్యాంకు సొంతంగా మరిన్ని నిధులను సేకరించుకునే సామర్థ్యం పెంచుకోగలదని, వచ్చే ఏడాదిలో రిజర్వ్ బ్యాంక్ ఆంక్షల పరిధి (పీసీఏ) నుంచి కూడా బైటికి రాగలదని భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. కేంద్రం నుంచి మూలధనం అందిన రోజునే అదే మొత్తంలో ఐడీబీఐ బ్యాంకు రీక్యాపిటజైషన్ బాండ్లు కొనుగోలు చేయనుంది. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్‌పై గానీ ఆర్థిక పరిస్థితిపై గానీ ప్రతికూల ప్రభావాలేమీ ఉండవు. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఐడీబీఐ బ్యాంకు రూ. 3,801 కోట్ల నష్టం ప్రకటించింది. అంతక్రితం క్యూ1లో ఇది రూ. 2,410 కోట్లు. మరోవైపు ప్రొవిజనింగ్‌ పెరగడంతో స్థూల మొండిబాకీలు (ఎన్‌పీఏ) 30.78 శాతం నుంచి 29.12 శాతానికి, నికర ఎన్‌పీఏలు 18.76 శాతం నుంచి 8.02 శాతానికి తగ్గాయి. 



You may be interested

ఇథనాల్‌ ధర పెంపు

Wednesday 4th September 2019

లీటరుకు రూ. 1.84 దాకా పెంపు 1 బిలియన్ డాలర్ల మేర తగ్గనున్న చమురు దిగుమతుల భారం న్యూఢిల్లీ: చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకునే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పెట్రోల్‌లో కలిపే ఇథనాల్‌ రేటును లీటరుకు రూ. 1.84 దాకా పెంచుతూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. దీంతో ఏటా 1 బిలియన్ డాలర్ల మేర చమురు దిగుమతుల భారం తగ్గుతుందని అంచనా. డిసెంబర్ 1 నుంచి చక్కెర మిల్లుల

మారుతీ చిన్న కార్లు ఇక నుంచి సీఎన్‌జీతోనే..

Wednesday 4th September 2019

కొత్త వ్యూహాం వెల్లడి   న్యూఢిల్లీ: దేశీ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) చిన్న కార్ల విషయంలో పెద్ద వ్యూహాన్నే రచించింది. విక్రయాలు గణనీయంగా పడిపోతున్న నేపథ్యంలో మళ్లీ డిమాండ్‌ను పెంచే దిశగా కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఇక నుంచి కంపెనీ విడుదలచేసే అన్ని చిన్న కార్లు సీఎన్‌జీ(కంప్రెస్డ్‌ నేచురల్ గ్యాస్) మోడల్‌తోనే ఉండనున్నట్లు మంగళవారం వెల్లడించింది. ఈ అంశంపై మాట్లాడిన కంపెనీ చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ..

Most from this category