News


యస్‌ బ్యాంక్‌ ప్రణాళికకు కేంద్రం ఓకే ..

Saturday 14th March 2020
news_main1584157393.png-32470

(అప్‌డేటెడ్‌...)

  • త్వరలో మారటోరియం ఎత్తివేత
  • చెరి రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తున్న ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ
  • రూ. 600 కోట్లు దాకా యాక్సిస్‌ బ్యాంక్, 
  • రూ. 500 కోట్లు కోటక్‌ మహీంద్రా పెట్టుబడి

న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ను గట్టెక్కించేందుకు ఉద్దేశించిన పునరుద్ధరణ ప్రణాళికకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ప్రణాళికను నోటిఫై చేసిన 3 రోజుల్లోగా బ్యాంకుపై మారటోరియంపరమైన ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు, 7 రోజుల్లోగా కొత్త బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం తెలిపారు. ‘ఆర్‌బీఐ ప్రతిపాదించిన యస్‌ బ్యాంక్‌ పునరుద్ధరణ ప్రణాళికకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. డిపాజిటర్ల ప్రయోజనాలు పరిరక్షించేందుకు, యస్‌ బ్యాంక్‌ను స్థిరపర్చేందుకు, బ్యాంకింగ్‌ వ్యవస్థలో పరిస్థితులు స్థిరంగా ఉండేలా చూసేందుకు ఈ స్కీమ్‌ తోడ్పడుతుంది‘ అని మంత్రి తెలిపారు. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)..49 శాతం వాటాలు కొనుగోలు చేస్తోందని, యస్‌ బ్యాంకు కొత్త బోర్డులో ఎస్‌బీఐ డైరెక్టర్లు ఇద్దరు ఉంటారని ఆమె చెప్పారు. కొత్త బోర్డు ఏర్పాటైన 7 రోజుల్లోగా అడ్మినిస్ట్రేటర్‌ తప్పుకుంటారన్నారు. ఎస్‌బీఐ వాటాలకు సంబంధించి 26 శాతానికి మాత్రమే మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉంటుందని, మిగతా ఇన్వెస్టర్లకు 75 శాతం వాటాలకు ఇది వర్తిస్తుందని మంత్రి చెప్పారు. ఇక, పెరుగుతున్న మూలధన అవసరాలకు అనుగుణంగా యస్‌ బ్యాంక్‌ అధీకృత మూలధనాన్ని రూ. 6,200 కోట్లకు పెంచినట్లు నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఆర్‌బీఐ ముసాయిదా పునరుద్ధరణ ప్రణాళిక ప్రకారం .. అధీకృత మూలధనం రూ. 5,000 కోట్లు.

ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ పెట్టుబడులు...
యస్‌ బ్యాంకులో రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు స్టాక్‌ ఎక్సే ్చంజీలకు ప్రైవేట్‌ రంగ ఐసీఐసీఐ బ్యాంకు తెలియజేసింది. ఇది 5 శాతం పైగా వాటాలకు సమానవుతుంది. అయితే, పునరుద్ధరణ స్కీమ్‌ ప్రకారం తుది వాటాల సంగతి వెల్లడవుతుందని పేర్కొంది. అటు రుణాల సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ కూడా రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక యాక్సిస్‌ బ్యాంక్‌ సైతం రూ. 600 కోట్లతో 60 కోట్ల దాకా షేర్లు కొనుగోలు చేయనుంది. ఇక, కోటక్‌ మహీంద్రా బ్యాంకు కూడా రూ. 500 కోట్లతో 50 కోట్ల షేర్లు తీసుకోనున్నట్లు స్టాక్‌ ఎక్సే ్చంజీలకు తెలియజేసింది. గవర్నెన్స్‌ లోపాలు, మొండిబాకీలు, నిధుల కొరత సమస్యలతో సంక్షోభంలోకి జారిపోయిన యస్‌ బ్యాంక్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ తన ఆధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. బ్యాంకు బోర్డును రద్దు చేయడంతో పాటు బ్యాంకు పునరుద్ధరణపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే మార్చి 5 నుంచి ఏప్రిల్‌ 3 దాకా బ్యాంకుపై మారటోరియం విధించింది. ఈ వ్యవధిలో ఖాతాదారులు రూ. 50,000కు మించి విత్‌డ్రా చేసుకోకుండా ఆంక్షలు పెట్టింది. అటు యస్‌ బ్యాంక్‌ దుస్థితికి కారణమైన వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను దర్యాప్తు ఏజెన్సీలు అరెస్ట్‌ చేశాయి.  You may be interested

పసిడీకి ‘‘వైరస్‌’’!

Saturday 14th March 2020

70 డాలర్లకు పైగా పతనం 2020 కనిష్ట స్థాయిలకు పయనం న్యూయార్క్‌: పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్‌- నైమెక్స్‌లో భారీ పతనాన్ని చూసింది. ఈ వార్తరాసే 11 గంటల సమయంలో పసిడి ధర 71 డాలర్ల నష్టంతో (4.5 శాతం) 1,520 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 1,504 డాలర్ల స్థాయికీ పడిపోయింది. 2020లో ఈ స్థాయికి పసిడి ధరలు పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఇది ఇన్వెస్టింగ్‌ టైమ్‌

Saturday 14th March 2020

ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం ఇన్వెస్టర్లను కలవరపరిచాయి. ఆరంభంలో లోయర్‌ సర్క్యూట్‌ 10 శాతం వరకు పడిపోయిన సూచీలు, ట్రేడింగ్‌ విరామం అనంతరం గణనీయంగా రికవరీ అయి లాభాల్లోకి అడుగుపెట్టాయి. ట్రేడింగ్‌ చివరి వరకు అదే ధోరణి కొనసాగింది. యూరోప్‌ మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్‌ కావడం, డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 719 పాయింట్లు పెరగడం మన మార్కెట్లలో ఉత్సాహనాన్ని పెంచింది. అయితే, గత మూడు వారాల్లో కరోనా వైరస్‌ కారణంగా ఈక్విటీలు భారీగా

Most from this category