News


ఐబీసీ చట్ట సవరణల ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ అనుమతి

Wednesday 25th December 2019
news_main1577245752.png-30422

న్యూఢిల్లీ: దివాలా అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌(ఐబీసీ)లో మరికొన్ని సవరణలను కేంద్రం తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్‌ మంగళవారం ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఢిల్లీలో మీడియాకు తెలిపారు. ఈ మార్పులతో.. దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభానికి ముందుగా కార్పొరేట్‌ రుణగ్రస్తులు ఏవైనా నేరాలకు పాల్పడి ఉంటే.. ఆయా కంపెనీలను కొనుగోలు చేసే నూతన ప్రమోటర్లపై అందుకు సంబంధించి ఎటువంటి బాధ్యత ఉండదు. అలాగే కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియకు అడ్జుకేటింగ్‌ అథారిటీ ఆమోదం తెలిపిన తేదీ తర్వాత కార్పొరేట్‌ రుణగ్రస్తులను విచారించడానికి లేదు. ఐబీసీలో సవరణలకు సంబంధించిన బిల్లును ఈ నెల 12న ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం గమనార్హం. అది ఇంకా ఆమోదానికి నోచుకోవాల్సి ఉంది. పలు అడ్డంకులను తొలగించి, దివాలా పరిష్కార ప్రక్రియ సాఫీగా సాగేందుకు వీలుగా కేంద్రం ఐబీసీలో సవరణలను పొందుపరించింది. 



You may be interested

మార్చి 12 నుంచి ఏవియేషన్‌ షో

Wednesday 25th December 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- రెండేళ్లకోసారి జరిగే ఏవియేషన్‌ షో ‘వింగ్స్‌ ఇండియా’ మార్చి 12 నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో  నాలుగు రోజులపాటు ఈ కార్యక్రమం జరుగనుంది. ఫ్లైయింగ్‌ ఫర్‌ ఆల్‌ అన్న నినాదంతో కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఫిక్కీ దీనిని నిర్వహిస్తున్నాయి. 5,000లకుపైగా చదరపు మీటర్ల విస్తీర్ణంలో 150 పైచిలుకు సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలను ఇక్కడ ప్రదర్శించనున్నాయి.

భారత్ లో ఆర్థిక మందగమనం

Wednesday 25th December 2019

తక్షణ చర్యలు అవసరం భారత్‌కు ఐఎంఎఫ్‌ సూచన విధానపరమైన చర్యలు తీసుకోవాలని సలహా రుణ వృద్ధి, ప్రైవేటు వినియోగం  బలహీనంగా ఉన్నాయని వ్యాఖ్య వాషింగ్టన్‌: భారత్‌లో ఆర్థిక మందగమన పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అభిప్రాయపడింది. దీర్ఘకాల ఈ ధోరణిని అరికట్టడానికి కేంద్రం తక్షణం విధానపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఐఎంఎఫ్‌ డైరెక్టర్స్‌ నివేదిక వెలువరించిన అంశాలను సంస్థ ఆసియా, పసిఫిక్‌ శాఖలో భారత్‌ వ్యవహారాల చీఫ్‌ రానిల్‌ సల్‌గాడో

Most from this category