News


బైజుస్‌లో జనరల్‌ అట్లాంటిక్‌ పెట్టుబడులు

Saturday 8th February 2020
news_main1581134286.png-31618

  • 1,420 కోట్ల మేర పెట్టుబడులు ! 

న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ సంస్థ, బైజుస్‌ తన ప్రస్తుత ఇన్వెస్టర్లలో ఒకటైన జనరల్‌ అట్లాంటిక్‌  నుంచి భారీ మొత్తంలో నిధులను సమీకరించింది. ఎంత మొత్తంలో జనరల్‌ అట్లాంటిక్‌ ఇన్వెస్ట్‌ చేసింది బైజుస్‌ వెల్లడించలేదు. అయితే ఈ సంస్థ బైజుస్‌లో రూ.1,420 కోట్లు(20 కోట్ల డాలర్లు) మేర ఇన్వెస్ట్‌ చేసిందని సమాచారం. టైగర్‌ గ్లోబల్‌ కూడా ఇదే రేంజ్‌లో ఇన్వెస్ట్‌ చేసి ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద ఈ తాజా రౌండ్‌లో బైజుస్‌ సంస్థ 130 కోట్ల డాలర్ల మేర నిధుల సమీకరించిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ పెట్టుబడుల ఆధారంగా బైజుస్‌ సంస్థ విలువ 820 కోట్ల డాలర్లు (రూ.58,220 కోట్లు) ఉంటుందని అంచనా.
నమ్మకానికి నిదర్శనం....
జనరల్‌ అట్లాంటిక్‌ తాజాగా పెట్టుబడులు పెట్టడం తమ కంపెనీపై ఆ సంస్థకున్న నమ్మకానికి నిదర్శనమని బైజుస్‌ సీఈఓ బైజు రవీంద్రన్‌ వ్యాఖ్యానించారు. తమ లెర్నింగ్‌ ప్రోగ్రామ్స్‌కు చిన్న నగరాల నుంచి కూడా ఆదరణ పెరుగుతోందని పేర్కొన్నారు. బైజుస్‌కు 4.2 కోట్ల మంది రిజిష్టర్డ్‌ యూజర్లున్నారు. 30 లక్షల మంది పెయిడ్‌ సబ్‌స్క్రైబర్లున్నారు. సగటున ఒక్కో విద్యార్థి రోజుకు 71నిమిషాలు బైజుస్‌ యాప్‌ను వినియోగిస్తున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ ఆదాయం మూడింతలై రూ.1,480 కోట్లకు ఎగసింది. ఆ ఆర్థిక సంవత్సరమే లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రెట్టింపై రూ.3,000 కోట్లకు చేరనున్నది. ఒకటి నుంచి 12వ తరగతి వరకూ లెర్నింగ్‌ ప్రాగ్రామ్స్‌ను అందిస్తోంది. వీటిని ప్రాంతీయ భాషల్లో అందించే ప్రయత్నాలు చేస్తోంది. త్వరలోనే బైజుస్‌ ఆన్‌లైన్‌ ట్యుటోరింగ్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నది. 



You may be interested

నిఫ్టీకి 12000 పాయింట్ల వద్ద మద్దతు!

Saturday 8th February 2020

నిఫ్టీకి తక్షణ మద్దతు 12000- 12080 పాయింట్ల వద్ద లభిస్తుందని, పైన 12160- 12200 పాయింట్ల వద్ద నిరోధం ఎదురవుతుందని టెక్నికల్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. శుక్రవారం నిఫ్టీ వెనుకంజ వేసి 12100 పాయింట్ల దిగువన క్లోజయింది. దీంతో 50 రోజుల డీఎంఏ మద్దతు కోల్పోయినట్లయింది. నిఫ్టీ చార్టుల్లో ప్రస్తుతం బేరిష్‌ ఎంగల్ఫింగ్‌ క్యాండిల్‌(డైలీ చార్టుల్లో), బుల్లిష్‌ క్యాండిల్‌(వీక్లీచార్టుల్లో) ఏర్పడ్డాయి. ప్రస్తుతం నిఫ్టీ కీలక స్థాయిల వద్ద ఉందని, బేర్స్‌, బుల్స్‌

ఎల్‌ఐసీ ఐపీఓ సరికాదు: ఫీల్డ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌

Saturday 8th February 2020

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించిన విధంగా ఎల్‌ఐసీలోని కొంత వాటాను ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా విక్రయిస్తే... దాని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కచ్చితంగా నష్టం వాటిల్లుతుందని నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ ఫీల్డ్‌ వర్కర్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎఫ్‌ఐఎఫ్‌డబ్ల్యూఐ) అభిప్రాయపడింది. వాటా విక్రయం కొంత భాగంతోనే పరిమితం కాకుండా, భవిష్యత్తులో మరింత వాటా ఇతరుల చేతికి వెళ్లే అవకాశం ఉందని ఫెడరేషన్‌

Most from this category