News


బైజూస్‌కు 540 మిలియన్‌ డాలర్ల నిధులు

Tuesday 18th December 2018
news_main1545109612.png-23027

న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్‌ స్టార్టప్‌ బైజూస్‌ తాజాగా 540 (రూ.3,888 కోట్లు) మిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించింది. దీంతో సంస్థ వ్యాల్యూషన్‌ 3.6 బిలియన్‌ డాలర్లతో (రూ.25,920 కోట్లు), దేశంలో నాలుగో అతిపెద్ద స్టార్టప్‌గా నిలిచింది. పేటీఎం, ఓలా, ఓయో రూమ్స్‌ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నాస్పర్స్‌, కెనడా పెన్షన్‌ ప్లాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు (సీపీపీఐబీ), జనరల్‌ అట్లాంటిక్‌ తాజా నిధుల సమీకరణ కార్యక్రమంలో పాల్గొని బైజూస్‌లో పెట్టుబడులు పెట్టాయి. డిమాండ్‌ అధికంగా ఉండడంతో ముందుగా అంచనా వేసిన దానికంటే అధికంగా నిధుల సమీకరణ జరిగింది. ‘‘దీర్ఘకాలిక భాగస్వాములైన నాస్పర్స్‌, సీపీపీఐబీ మా బోర్డులోకి రావడం సంతోషంగా ఉంది. ప‍్రపంచంలో అతిపెద్ద విద్యా సంబంధిత కంపెనీగా అవతరించాలన్న మా లక్ష్యాన్ని ఈ భాగస్వామ్యం మరింత పటిష్టం చేస్తుంది. ప్రపంచంలోనే భారత్‌లో స్కూల్‌కు వెళ్లే చిన్నారుల సంఖ్య అధికంగా ఉంది. తమ పిల్లల విద్య కోసం ఎంత అయినా ఖర్చు పెట్టేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. మంచి విద్య అనేది విజయానికి మంచి మార్గం చూపుతుంది. సమీప కాలంలో లాభాలు అన్నవి మాకు కీలకం. ఓ కంపెనీగా దీర్ఘకాల స్థిరమైన వృద్ధిపై మా దృష్టి ఉంటుంది. విద్యార్థులు నేటి రోజుల్లో ఇంటరాక్టివ్‌ విధానాల ద్వారా చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు’’ అని బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌ అన్నారు. 
కొత్త ఉత్పత్తుల రూపకల్పన
తాజాగా సమీకరించిన నిధులను కొత్త ఉత్పత్తుల రూపకల్పన, అంతర్జాతీయ మార్కెట్లో విస్తరణకు వినియోగస్తామని బైజూస్‌ తెలిపింది. చివరి సారి నిధుల సమీకరణ నుంచి చూస్తే బైజూస్‌ మార్కెట్‌ విలువ మూడు రెట్లు పెరగడం గమనార్హం. బెంగళూరులో ఓ టీచింగ్‌ కేంద్రంతో  ఆరంభమైన బైజూస్‌ 2015లో యాప్‌ను విడుదల చేయడం ద్వారా యూజర్లను పెంచుకుంది. ప్రస్తుతం రెండు లెర్నింగ్‌యాప్స్‌ను అందిస్తోంది. ఆరు నుంచి పదకొండో తరగతి వరకు ఒక యాప్‌, నాలుగు, ఐదో తరగతి విద్యార్థుల కోసం మరో యాప్‌ ఉద్దేశించింది కావడం గమనార్హం. యువ విద్యార్థుల (కాలేజీ విద్యార్థులు) కోసం త్వరలో మారో యాప్‌ను కూడా తీసుకురానుంది. 
 You may be interested

హిటాచీ చేతికి ఏబీబీ పవర్ వ్యాపారం

Tuesday 18th December 2018

న్యూఢిల్లీ: స్విస్ ఇంజినీరింగ్ దిగ్గజం ఏబీబీకి చెందిన పవర్ గ్రిడ్స్ వ్యాపార విభాగాన్ని జపాన్‌ సంస్థ హిటాచీ కొనుగోలు చేయనుంది. ఈ విభాగంలో 80.1 శాతం వాటాలను హిటాచీ కొనుగోలు చేస్తున్నట్లు ఏబీబీ వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం పవర్ గ్రిడ్స్‌ వ్యాపార పరిమాణాన్ని 11 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.79,200 కోట్లు) లెక్క కట్టినట్లు, డీల్ విలువ సుమారు 6.4 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 46,080 కోట్లు)

గూగుల్ మ్యాప్స్‌లో ఆటో రిక్షా రూట్లు

Tuesday 18th December 2018

న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తాజాగా తమ మ్యాప్స్ యాప్‌లో ఆటో రిక్షా రూట్లను కూడా పొందుపర్చింది. ఏయే ప్రాంతాలకు ఆటోల్లో ప్రయాణించేందుకు ఎంతెంత చార్జీలవుతాయన్నది ఇది ఉజ్జాయింపుగా చూపిస్తుంది. ఆయా రూట్లలో ఆటో చార్జీలపై ప్రయాణికులు ఒక అంచనాకు వచ్చేందుకు ఈ ఫీచర్ తోడ్పడగలదని గూగుల్ మ్యాప్స్ ప్రోడక్ట్ మేనేజర్ విశాల్ దత్తా తెలిపారు. దీన్ని సోమవారం నుంచి ముందుగా ఢిల్లీలో అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారాయన. ఢిల్లీ ట్రాఫిక్

Most from this category