News


బైజూస్‌కు భారీగా నిధులు

Friday 10th January 2020
news_main1578630106.png-30824

  • ఇన్వెస్ట్‌ చేసిన టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌

న్యూఢిల్లీ: విద్యా సంబంధిత అత్యాధునిక టెక్నాలజీల్లో ప్రముఖ కంపెనీ అయిన బైజూస్‌.. టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి పెద్ద మొత్తంలో నిధులను అందుకుంది. కంపెనీ ఎంత మొత్తం అన్నది వెల్లడించనప్పటికీ.. టైగర్‌ గ్లోబల్‌ 200 మిలియన్‌ డాలర్లు (రూ.1,400 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘‘విద్యార్థుల అభ్యాసన విధానాన్ని మార్చి వేయాలన్న మా దీర్ఘకాల దృక్పథాన్ని టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌తో భాగస్వామ్యం ముందుకు తీసుకెళుతుంది’’ అని బైజూస్‌ వ్యవస్థాపకుడు, సీఈవో రవీంద్రన్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ ట్యూటరింగ్‌ను రానున్న నెలల్లో ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. అలాగే, స్థానిక భాషల్లో విద్యా కార్యక్రమాలను ప్రారంభించే దిశగా పనిచేస్తున్నట్టు ఆయన తెలిపారు. 



You may be interested

జీటీపీఎల్‌, డెల్టా కార్ప్‌, అలుఫ్లోరైడ్‌ అప్‌

Friday 10th January 2020

వరుసగా మూడో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇటీవల పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్త వాతావరణం చల్లబడటంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ లాభాల సెంచరీ చేసింది. ఉదయం 10 ప్రాంతం‍లో 148 పాయింట్లు ఎగసి 41,600ను తాకగా.. నిఫ్టీ 40 పాయింట్లు పుంజుకుని 12,256 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల ఆధారంగా మిడ్‌ క్యాప్‌ కంపెనీలు జీటీపీఎల్‌ హాథవే, డెల్టా కార్ప్‌, అలు

తగ్గనున్న ఈ-వెరిటో ధర..!

Friday 10th January 2020

రూ. లక్ష వరకు తగ్గే అవకాశం వచ్చే ఏడాదిలో ఎలక్ట్రిక్‌ ఎక్స్‌యూవీ 300 మహీంద్ర ఎండీ పవన్‌ గోయెంకా వ్యాఖ్య న్యూఢిల్లీ: భారత ఎలక్ట్రిక్‌ వాహనాల డిమాండ్‌కు తగిన సప్లైని చేరుకోవడానికి మరెంతో సమయం పట్టదని మహీంద్రా అండ్‌ మహీంద్ర (ఎం అండ్‌ ఎం) మేనేజింగ్‌ డైరెక్టర్‌ పవన్‌ గోయెంకా అన్నారు. ఈ పరిశ్రమను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత వరకు చేయగలదో అంతా చేసిందని, వీటితో పాటు మరిన్ని ప్రయోజనాలు

Most from this category