News


బిలియనీర్ల జాబితాలోకి బైజూస్‌ రవీంద్రన్

Tuesday 30th July 2019
news_main1564463474.png-27398

న్యూఢిల్లీ: దేశ బిలియనీర్ల జాబితాలో బైజూస్‌ వ్యవస్థాపకుడు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) బైజు రవీంద్రన్‌ చేరారు. కతార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ (క్యూఐఏ)-- సావరిన్‌ వెల్త్‌  ఫండ్‌ నుంచి టెక్‌ కంపెనీ బైజూస్‌కు 150 మిలియన్‌ డాలర్ల ఫండ్‌ లభించడంతో రవీంద్రన్‌ తాజాగా బిలియనీర్ల జాబితాలో చేరారు. దీనితో కంపెనీ విలువ 6 బిలియన్‌ డాలర్లకు చేరింది. కాగా తాజా వార్తలపై సంస్థ ప్రతినిధి స్పందించలేదు.  బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ అండ్‌ ఆన్‌లైన్‌ ట్యుటోరియల్‌ సంస్థలో రవీంద్రన్‌కు 21కన్నా అధికంగా వాటా ఉంది. బ్రాండ్‌ పట్ల ప్రజల్లో విస్తృత ప్రచారం, విద్యారంగంలోకి దూసుకుపోడానికి చేస్తున్న ప్రయత్నాలు వంటి అంశాలు నేపథ్యంలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో బైజూస్‌ ఆదాయం మూడింతలై రూ.1,430 కోట్లకు చేరింది. 



You may be interested

మార్కెట్‌లోకి బిగ్‌బాస్‌

Tuesday 30th July 2019

ప్రభుత్వం ముందు ప్రతిపాదన ఇప్పటికే ప్రాథమికంగా చర్చలు లిస్ట్‌ అయితే దేశంలో టాప్‌ కంపెనీగా అవతరణ ఆర్‌ఐఎల్‌, టీసీఎస్‌ వెనక్కి న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజ సంస్థ ఎల్‌ఐసీ షేర్లను కొనుగోలు చేసే రోజు భవిష్యత్తులో చూసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే పెట్టుబడుల ఉపసం‍హరణ/వాటాల అమ్మకాల ద్వారా కేంద్రంలోని మోదీ సర్కారు పెద్ద ఎత్తున నిధుల సమీకరణకు ప్రాధాన్యం ఇస్తుండడంతో, ఎల్‌ఐసీ లిస్టింగ్‌ కూడా ప్రభుత్వ అజెండాలో భాగంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ

గ్లోబల్‌ టాప్‌ సీఈఓల్లో అంబానీ

Tuesday 30th July 2019

సీఈఓవరల్డ్‌ మ్యాగజైన్‌ గ్లోబల్‌ ర్యాకింగ్స్‌ అత్యంత ప్రభావశీల సీఈఓల జాబితాలో 10 మంది భారతీయులు లక్ష్మీ మిట్టల్‌ది మొదటిస్థానమైనా లగ్జెంబర్గ్‌ కేంద్ర కంపెనీగా గుర్తింపు దీనితో ముకేశ్‌కు దేశంలో మొదటిస్థానం వాల్‌మార్ట్‌ సీఈఓ డగ్లస్‌ మ్యాక్‌మిలన్‌ టాప్‌ న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సీఈఓవరల్డ్‌ మ్యాగజైన్‌  తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీల చీఫ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ (సీఈఓ) 2019 జాబితాను విడుదల చేసింది. 121 మందితో కూడిన ఈ జాబితాలో వాల్‌మార్ట్‌ సీఈఓ డగ్లస్‌ మ్యాక్‌మిలన్‌ ముందు నిలిచారు. 10 మంది భారతీయులకూ ఈ

Most from this category