News


విదేశీ ఆన్‌లైన్‌ ఉత్పత్తులు మరింత ప్రియం..?

Monday 10th February 2020
news_main1581326385.png-31660


 

ముంబై: విదేశీ ఆన్‌లైన్‌ సైట్లలో ఉత్పత్తులు మరింత ప్రియం కానున్నాయి. భారత దేశంలో ఆన్‌లైన్‌లో కొనుగోలు, విక్రయాలు నిర్వహిస్తున్న విదేశీ సైట్లపై  ప్రభుత్వం ముందస్తు పన్నుతో పాటు కస్టమ్స్‌ మోడ్‌ల్‌ను ప్రవేశపెట్టనుంది. దీనివల్ల చైనాతో పాటు ఇతర విదేశీ ఈ -కామర్స్‌ సైట్ల ద్వారా ఉత్పత్తులను విక్రయించే కంపెనీలు ఆయా వస్తువుల షిప్పింగ్‌ కంటే ముందే పన్ను, కస్టమ్స్‌ డ్యూటీ చెల్లిస్తేనే ఆయా ఉత్పత్తులు కొనుగోలు దారులకు చేరతాయి. ఈ కొత్త ముందస్తు పన్ను వల్ల విదేశీ సైట్లలో కొనుగోలు చేసే వస్తువుల ధరలు 50 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే  ఈ విషయంపై ప్రభుత్వం వివిధ సంస్థల నుంచి సిఫార్సులు కోరింది.

గతేడాదే గుర్తించినప్పటికీ...
చాలా ఈ కామర్స్‌ సైట్‌లు పన్నులు, ఎగ్గోట్టెందుకు పోస్టల్‌ గిఫ్ట్‌ చానెల్‌ ద్వారా వివిధ రకాల ఉత్పత్తులను భారత్‌లో విక్రయిస్తుండడాన్ని ప్రభుత్వం గతేడాదే గుర్తించింది. వీటన్నింటిని అరికట్టేందుకు తాజాగా ఈ కొత్త ప్రీపెయిడ్‌ డిపాజిట్‌ డ్యూటీలను అమల్లోకి తీసుకురానుంది. ముందస్తు పన్ను, ​‍కస్టమ్స్‌ మోడల్‌ ద్వారా  విదేశీ ఉత్పత్తుల సరఫరాదారు చెల్లించాల్సిన  కస్టమ్స్‌, ఐజీఎస్‌టీ వంటివాటిలో మరింత పారదర్శకత పెరుగుతుందని ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ‘లోకల్‌ సర్కిల్స్‌’ చైర్మన్‌ సచిన్‌ టపారియా  ఈ సందర్భంగా వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది చైనా దేశపు చాలా కంపెనీలు ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ సంస్థలు కస్టమ్స్‌, జీఎస్‌టీలను కట్టడంలేదని ప్రభుత్వం గుర్తించింది. చైనా నుంచి ఇండియాకు షిప్పింగ్‌ అయ్యే ఉత్పత్తులన్నీ గిఫ్ట్స్‌ ప్రాతిపదికన స్థానిక చట్టాలను, సుంకాలను ఎగవేస్తుండడాన్ని కస్టమ్స్‌ విభాగం గుర్తించింది. వీటిని 60 శాతం తగ్గించాలని భావించిన ముంబై కస్టమ్స్‌ విభాగం గిఫ్ట్స్‌ రూపంలో వచ్చే షిప్‌మెంట్‌లన్నింటిని నిషేధించింది. మెడిసిన్స్‌, రాఖీల మీద తప్పించి అన్ని రకాల ఉత్పత్తులపై ఫారిన్‌ ట్రేడ్‌ పాలసీని ఎత్తివేస్తూ చట్టం చేసింది. ఇక ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే విదేశీ ఉత్పత్తులు తప్పనిసరిగా ముందస్తు పన్నులు చెల్లించాల్సిందే. అయితే ఇండియా కేంద్రంగా నడుస్తున్న ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి సైట్లలో కొనుగోలు చేసే ఉత్పత్తుల రేట్ల కంటే విదేశీ సైట్లలో 50 శాతం ధరలు అధికంగా ఉంటాయి. తద్వారా కొనుగోలు దారులు దేశీయ ఆన్‌లైన్‌ సైట్లలో కొనేందుకు ఆసక్తి కనబరుస్తారని ఆయన వివరించారు. You may be interested

6 శాతం వృద్ధి అంచనాలను అందుకోగలమా?!

Monday 10th February 2020

వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి లక్ష్యం కష్టమే తదుపరి సమీక్షలలో వడ్డీ రేట్ల కోతలకు చాన్స్‌ తక్కువే - దీప్తి మేరీ మాథ్యూ, జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఆర్థిక సర్వే అంచనా వేసినట్లు వచ్చే ఏడాది(2021)లో దేశ ఆర్థిక వ్యవస్థ 6-6.5 శాతం వృద్ధి అంచనాలను అందుకోవడం కష్టమేనంటున్నారు.. జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఆర్థికవేత్త దీప్తి మేరీ మాథ్యూ. రిజర్వ్‌ బ్యాంక్‌ పాలసీ నిర్ణయాలు, ద్రవ్యోల్బణం తదుపరి అంశాలపై ఒక ఇంటర్వ్యూలో దీప్తి వ్యక్తం

ఈ వారం నిఫ్టీకి 12,200 కీలకం?!

Monday 10th February 2020

హెచ్చుతగ్గులకు చాన్స్‌ 12.400కు చేరుకునే అవకాశాలు తక్కువే - ఉమేష్‌ మెహతా, రీసెర్చ్‌ హెడ్‌,  శామ్‌కో సెక్యూరిటీస్‌ కేంద్ర బడ్జెట్‌ విడుదల, రిజర్వ్‌ బ్యాంక్‌ పాలసీ సమీక్ష, దిగ్గజ కంపెనీల క్యూ3 ఫలితాలు వంటి ప్రధాన అంశాలను దాటుకుని వచ్చేశామంటున్నారు శామ్‌కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌.. ఉమేష్‌ మెహతా. దీంతో ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర హెచ్చుతగ్గులను చవిచూసే వీలున్నట్లు చెబుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో మార్కెట్లపై ఉమేష్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాలను

Most from this category