News


ఉద్యోగుల ప్రయోజనాలూ పరిరక్షిస్తాం

Tuesday 4th February 2020
news_main1580786379.png-31481

  • అడ్డగోలుగా తీసివేయడం కుదరదు
  • ఎయిరిండియా, బీపీసీఎల్ విక్రయాలపై కేంద్రం వివరణ

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఎయిరిండియా, బీపీసీఎల్‌లో వాటాలను విక్రయించినప్పటికీ.. ఉద్యోగుల ప్రయోజనాలను కూడా పరిరక్షించే విధంగా షేర్ల విక్రయ ఒప్పందాల్లో నిబంధనలు ఉంటాయని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత తెలిపారు. కొనుగోలు చేసిన సంస్థలు.. అడ్డగోలుగా ఉద్యోగులను తొలగించేందుకు ఉండబోదని పేర్కొన్నారు. ఎయిరిండియా, బీపీసీఎల్‌ బిడ్డింగ్ ప్రక్రియ రెండు దశల్లో ఉంటుందని చెప్పారు. నష్టాలు, రుణాల భారంతో కుంగుతున్న ఎయిరిండియాలో, చమురు రంగ దిగ్గజం బీపీసీఎల్‌లో మొత్తం 53.29 శాతం వాటాలను కేం‍ద్రం విక్రయించే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఎయిరిండియాకు సంబంధించి ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహ్వనించింది. దీనికి మార్చి 17 ఆఖరు తేది. బీపీసీఎల్‌ ఈవోఐలను మరికొన్ని రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. 


    బీపీసీఎల్‌ వేల్యుయేషన్‌ను తక్కువగా లెక్కగట్టి అమ్మేస్తున్నారన్న ఉద్యోగ సంఘాల ఆరోపణలపై స్పందిస్తూ.. సంస్థ విలువను మదింపు చేసేందుకు స్వతంత్ర వేల్యుయర్‌, లావాదదేవీల సలహాదారులు ఉంటారని కాంత చెప్పారు. రిజర్వ్‌ ధరను ఆర్థిక బిడ్లు వచ్చే దాకా వెల్లడించడం జరగదని తెలిపారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థల ఉద్యోగ సంఘాల లెక్కల ప్రకారం.. బీపీసీఎల్‌ అసెట్స్‌ రూ. 9 లక్షల కోట్ల పైగా ఉంటాయని అంచనా. ప్రస్తుతం సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 1 లక్ష కోట్లుగా ఉండగా.. ప్రస్తుత రేటు ప్రకారం ప్రభుత్వ వాటా విలువ సుమారు రూ. 54,000 కోట్లు ఉంటుంది. 



You may be interested

టీసీఎస్‌కు రూ.10,650 కోట్ల కాంట్రాక్ట్‌

Tuesday 4th February 2020

డబ్ల్యూబీఏ నుంచి పదేళ్ల కాంట్రాక్టు  న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) భారీ కాంట్రాక్ట్‌ను సాధించింది. ఫార్మా కంపెనీ వాల్‌గ్రీన్స్‌ బూట్స్‌ అలయెన్స్‌(డబ్ల్యూబీఏ) నుంచి ఈ కాంట్రాక్ట్‌ను పొందామని టీసీఎస్‌ తెలిపింది. ఈ కాంట్రాక్ట్‌ కాలపరిమితి పదేళ్లని పేర్కొంది. కాంట్రాక్టులో భాగంగా డబ్ల్యూబీఏకు అవసరమైన ఐటీ సర్వీసులను అందిస్తామని వివరించింది. వేగంగా విస్తరిస్తున్న వ్యాపార అవసరాలను సమర్థవంతంగా అందిపుచ్చుకునేందుకు టీసీఎస్‌తో భాగస్వా‍మ్యం ఉపకరించగలదని డబ్ల్యూబీఏ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, గ్లోబల్‌

ఇన్‌ఫ్రా కోసమే డిజిన్వెస్ట్‌మెంట్ నిధులు..

Tuesday 4th February 2020

ఫిక్కీ సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా సమీకరించిన నిధులను మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసమే వినియోగిస్తామని.. ద్రవ్య లోటును భర్తీ చేసుకునేందుకు కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థపై ఇది అనేక రకాలుగా సానుకూల ప్రభావం చూపగలదని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. "సమీకరించిన

Most from this category