News


ఎస్‌బీఐ హోం బయ్యర్‌ గ్యారెంటీ స్కీమ్‌

Tuesday 21st January 2020
news_main1579598839.png-31073

గృహరుణాల్లో ఎస్‌బీఐ ఆర్‌బీబీజీ స్కీమ్‌!

ముంబై: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గృహరుణాలు పొందే కస్టమర్లకు సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే  రెసిడెన్షియల్‌ బిల్డర్‌ ఫైనాన్స్‌ విత్‌ బయ్యర్‌ గ్యారెంటీ(ఆర్‌బీబీజీ స్కీమ్‌) స్కీమ్‌. ఈస్కీమ్‌తో ఎస్‌బీఐ వద్ద గృహరుణాలు తీసుకునే కస్టమర్లకు ప్రాజెక్ట్‌ గ్యారెంటీని అందిస్తుంది.అంటే  ఏదైనా ఒక ప్రాజెక్ట్‌ లో ఇల్లు కొనుక్కోవడానికి ఎస్‌బీఐలో లోను తీసుకుంటే ఆ ప్రాజెక్ట్‌ మధ్యలో ఆగిపోకుండా పూర్తి చేసే గ్యారెంటీని ఆర్‌బీబీజీ స్కీమ్‌ ఇస్తుంది. దీని ద్వారా రుణం తీసుకున్న కస్టమర్లకు తమ ఇల్లు సొంతమవతుందనే భరోసాను కల్పిస్తుంది. ఆర్‌బీబీజీ స్కీమ్‌ దేశవ్యాప్తంగా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు వర్తించదు. ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌(ఎమ్‌ఎమ్‌ఆర్‌), నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌(ఎన్‌సీఆర్‌), హైదరాబాద్‌, బెంగళూరు, పునే, కోల్‌కతా, చెన్నై నగరాల్లో మాత్రమే ఈ స్కీమ్‌ను అందిస్తుంది. ఈ నగరాల్లో ఎంపిక చేసిన ఎస్‌బీఐ బ్రాంచ్‌లలోని కార్పొరేట్‌ క్లైంట్‌ గ్రూపులు దీనిని నిర్వహిస్తాయి. ప్రస్తుతం ఈస్కీమ్‌ను ముంబైకి చెందిన రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ సన్‌టెక్‌ రియాల్టీ ఆర్‌బీబీజీ స్కీమ్‌ను పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద  చేపట్టింది. ఏ ప్రాజెక్ట్‌కు అయితే ఎస్‌బీఐ ఆర్థిక రుణాన్ని ఇస్తుందో ఆ ప్రాజెక్టుల్లో కొనుక్కునే కస్టమర్లకు మాత్రమే ఈ స్కీమ్‌ వర్తిస్తుంది. 



You may be interested

నిరాశావాదంలో కార్పొరేట్‌ దిగ్గజాలు!...పీడబ్ల్యూసీ సర్వే

Tuesday 21st January 2020

-రికార్డు స్థాయిలో ఉన్నారన్న పీడబ్ల్యూసీ సర్వే  దావోస్‌: మేధావులైనా, అపర కుబేరులైనా సరే సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు మానసిక ఆందోళన ఎదుర్కోక తప్పదు. ఇదే విషయం తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీల సీఈవోలలో  నిరాశావాదం రికార్డు స్థాయిలో ఉందని తాజాగా ఓ సర్వేలో తేలింది.  గ్లోబల్‌ కన్సల్టెన్సీ పీడబ్ల్యూసీ ప్రపంచ వ్యాప్తంగా 83 ప్రాంతాల్లో 1600 మంది సీఈవోలపై సర్వే నిర్వహించింది. పీడబ్ల్యూసీ తన నివేదికను

అమ్మకాల ఒత్తిడిలో మెటల్‌ షేర్లు

Tuesday 21st January 2020

1శాతం నష్టాన్ని చవిచూసిన నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌  3శాతం క్షీణించి ఎన్‌ఎండీసీ మార్కెట్‌ పతనంతలో భాగంగా మంగళవారం మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ మిడ్‌సెషన్‌ కల్లా 1శాతం నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,823.65 వద్ద మొదలైంది. మార్కెట్లో నెలకొన్న అమ్మకాలతో మెటల్‌ షేర్లు ఉదయం సెషన్‌లో భారీగా నష్టాలను చవిచూశాయి. ఒకదశలో దాదాపు 1శాతం నష్టపోయి 2809.00

Most from this category