News


పార్లమెంటులో ‘బిజినెస్‌’

Wednesday 26th June 2019
news_main1561535303.png-26587

భారీ బ్యాంకింగ్‌ మోసాలు తగ్గుతున్నాయ్‌!
బ్యాంకుల్లో లక్ష రూపాయలు ఆపైబడిన మొత్తాల్లో మోసాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని రాజ్యసభలో నిర్మలా సీతారామన్‌ మంగళవారం ఒక లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఆమె తెలిపిన సమాచారం ప్రకారం-
- 2016-17లో బ్యాంకులు ఇతర ఫైనాన్షియల్‌ సంస్థల్లో  రూ. లక్ష ఆపైబడిన మోసాల పరిమాణం రూ.25,884 కోట్లు.
- 2017-18లో ఈ విలువ రూ. 9,866 కోట్లు.
- 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.6,735 కోట్లు. 

    ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బ్యాంకుల్లో మోసాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉద్దేశపూర్వక ఎగవేతదారుల విషయంలో బ్యాంకులే తమకుతాముగా క్రిమినల్‌ చర్యలు తీసుకునే వీలు కల్పించినట్లు పేర్కొన్నారు. ఆర్థిక నేరాలకు సంబంధించి తప్పించుకు తిరుగుతున్న నేరస్తుల నిరోధక చట్టం, 2018, రూ.50 కోట్లు పైబడిన రుణాలకు సంబంధించి ఆయా కంపెనీలు, ప్రమోటర్ల పాస్‌పోర్ట్‌ సర్టిఫైడ్‌ కాపీ పొందేలా ప్రభుత్వ రంగ బ్యాంకులకు అధికారం వంటి అంశాలను ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారీ విలువలో బ్యాంకులను మోసం చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకుగాను ఒక ఇంటర్‌ ఏజెన్సీ సహకార కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్నీ నిర్మలాసీతారామన్‌ గుర్తుచేశారు. 
రూపాయి కదలికలపై కన్ను
రోజూవారీ ప్రాతిపదికన డాలర్‌ మారకంలో రూపాయి విలువను కేంద్రం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు ఆర్థికమంత్రి రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. డాలర్‌ మారకంలో రూపాయి విలువ మంగళవారం 69.36 వద్ద ముగిసింది. 2013-14 నుంచి 2018-19 ఏప్రిల్‌- డిసెంబర్ మధ్య కాలాన్ని చూస్తే, రూపాయి సగటున రూ.60.50 నుంచి రూ.69.74 కనిష్టానికి పడినట్లు ఆర్థికమంత్రి తెలిపారు. 2017-18లో భారత్‌కు ప్రవాసభారతీయుల నుంచి వచ్చిన మ్తొతం 69.12 బిలియన్‌ డాలర్లు ఉంటే, 2018-19 ఏప్రిల్‌-డిసెంబర్‌ మధ్య కాలంలో ఈ మొత్తం 58.31 బిలియన్‌ డాలర్లుగా ఉందని మంత్రి వెల్లడించారు. 
నగదు చెలామణీ పెరిగింది...
వ్యవస్థలో కరెన్సీ చెలామణీని తగ్గించడం పెద్ద నోట్ల రద్దు ప్రధాన లక్ష్యం. అయితే ఈ లక్ష్యం పెద్దగా నెరవేరినట్లు కనిపించడంలేదు. రాజ్యసభలో నిర్మలాసీతారామన్‌ తెలిపిన సమాచారం ప్రకారం... పెద్దనోట్ల రద్దుకు ముందు అంటే 2016 నవంబర్‌ 4వ తేదీ నాటికి చెలామణీలో ఉన్న నగదు  విలువ రూ.17,74,187 కోట్లు. అయితే 2019 మే 31 వ తేదీ నాటకి ఈ విలువ రూ.21,71,835 కోట్లకు చేరింది. అంటే పెద్దనోట్ల రద్దు ముందు పరస్థితితో పోల్చితే, కరెన్సీ చెలామణీ 22 శాతం పెరిగిందన్నమాట. 2016 నవంబర్‌ 8న కేంద్రం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసింది. ఇక సర్కులేషన్‌లో ఉన్న నోట్స్‌ 2014 అక్టోబర్‌ 2014 నుంచీ చూస్తే,  14.51 శాతం ఎగసింది. ఇక 2016 నవంబర్‌లో డిజిటల్‌ లావాదేవీల విలువ రూ.112.27 లక్షల కోట్లయితే, అది 2018 సెప్టెంబర్‌లో రూ.188.07 లక్షల కోట్లకు చేరినట్లు మంత్రి తెలిపారు. You may be interested

‘సొనాటా’ వెడ్డింగ్‌ కలెక్షన్‌

Wednesday 26th June 2019

హైదరాబాద్‌: వివాహ సీజన్‌ సందర్భంగా నూతన వధూవరుల కోసం ప్రత్యేక వెడ్డింగ్‌ కలెక్షన్‌ను ప్రారంభించినట్లు టైటాన్‌ కంపెనీకి చెందిన ప్రముఖ వాచీల బ్రాండ్‌ ‘సొనాటా’ వెల్లడించింది. హ్యాండ్‌ క్రాఫ్టెడ్‌ డిజైన్లను ఈ కలెక్షన్‌లో భాగంగా అందిస్తోంది. వివాహ సమయంలో వధువులకు సరిగ్గా సరిపడే విధంగా బంగారం, రోజ్‌ గోల్డ్‌ ప్లేటింగ్‌తో నూతన వేరియంట్స్‌ అందుబాటులో ఉండగా... పురుషులు కోసం నాణ్యత, డిజైన్‌ పరంగా ప్రీమియంగా కనిపించే లెదర్‌ స్ట్రాప్స్‌, రోజ్‌

భవిష్యత్తు అల్యూమినియం ప్యాకేజింగ్‌దే: ఏబీసీఏఐ

Wednesday 26th June 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: పానీయాల ప్యాకేజింగ్‌కు అల్యూమినియం క్యాన్లను వాడటం పెరుగుతోందని అల్యూమినియం బెవరేజెస్‌ క్యాన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏబీసీఏఐ) స్పష్టంచేసింది. కల్తీకి ఆస్కారం లేకపోవడం, పానీయాల జీవిత కాలం ఎక్కువ ఉండడం, ప్లాస్టిక్‌ పట్ల విముఖత ఇందుకు కారణమని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఏటా అల్యూమినియంతో తయారైన 200 కోట్ల పానీయాల క్యాన్లు విక్రయం అవుతున్నాయని బాల్‌ బెవరేజ్‌ ప్యాకేజింగ్‌ ఇండియా ఎండీ అమిత్‌ లహోటి తెలిపారు. ఆదిత్య

Most from this category