News


బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారుతున్న టెలికం యూజర్లు..

Friday 22nd November 2019
news_main1574393879.png-29773

బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారుతున్న టెలికం యూజర్లు..
మొబైల్ నంబర్‌ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) కారణంగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు మారే వారి కన్నా.. వేరే ఆపరేటర్ల నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. 2018-19లో పోర్ట్-అవుట్స్‌ సంఖ్య (వేరే ఆపరేటర్‌కు మారినవారు) 28.27 లక్షలుగా ఉండగా, పోర్ట్‌-ఇన్స్ (బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారిన వారు) 53.64 లక్షలుగా ఉంది. మొత్తం మీద 2019 అక్టోబర్‌ దాకా 2.04 కోట్ల మేర పోర్ట్-ఇన్స్‌ ఉండగా, 1.80 కోట్ల మేర పోర్ట్‌-అవుట్స్ ఉన్నాయి. ఆగస్టు 31 నాటికి బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ కనెక్షన్ల సంఖ్య 11.64 కోట్లుగా ఉన్నట్లు కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ లోక్‌సభలో తెలిపారు. 

సోషల్‌ మీడియాకు కొత్త ఐటీ నిబంధనలు...
సోషల్ మీడియాలో వదంతులకు చెక్ పెట్టే విధంగా కేంద్రం కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)నిబంధనలు రూపొందిస్తోంది. వీటి ప్రకారం సోషల్ మీడియా సంస్థలు వివాదాస్పద సమాచారం మూలాలు గుర్తించడంతో పాటు నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోగా సదరు సమాచారాన్ని తమ ప్లాట్‌ఫాంల నుంచి తొలగించాల్సి ఉంటుంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే రాజ్యసభకు ఈ విషయం తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు, మెసేజింగ్ యాప్స్ ద్వారా ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందకుండా తీసుకోతగిన చర్యల గురించి కేంద్రం గతేడాది డిసెంబర్‌లో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. వీటిని విశ్లేషించిన మీదట తాజా నిబంధనలు రూపొందించింది. 



You may be interested

కిడ్‌జీపై కన్నేసిన యూరోకిడ్స్‌

Friday 22nd November 2019

సొంతం చేసుకునేందుకు చర్చలు రూ.1000-1200 కోట్లు ఆఫర్‌ ఇటీవలే యూరోకిడ్స్‌ను కొనుగోలు చేసిన కేకేఆర్‌ న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రైవేటు ఈక్విటీ సంస్థ కేకేఆర్‌ విద్యా రంగంలో​మరింత బలపడేందుకు ప్రయత్నం చేస్తోంది. జీలెర్న్‌కు చెందిన కిడ్‌జీ విభాగం పట్ల యూరోకిడ్స్‌ ఆసక్తిగా ఉన్నది. కేకేఆర్‌ భాగస్వామిగా ఉన్న యూరోకిడ్స్‌ ఇందుకు సంబంధించి ప్రాథమిక చర్చలను ప్రారంభించింది. కిడ్‌జీ అన్నది ప్రీస్కూల్స్‌ ప్లాట్‌ఫామ్‌. డీల్‌ విలువ రూ.1,000-1,200 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. డీల్‌ కుదిరితే

అక్టోబర్‌లో రూ.2.5 లక్షల కోట్ల రుణాల పంపిణీ

Friday 22nd November 2019

ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ న్యూఢిల్లీ: పండుగ సీజన్‌లో భాగంగా అక్టోబర్‌లో ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రూ.2.5 లక్షల కోట్ల రుణాలను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ప్రకటించింది. నిదానించిన ఆర్థిక వ్యవస్థకు, వినియోగానికి ప్రేరణనిచ్చేందుకు కేంద్ర ‍ప్రభుత్వం సూచనల మేరకు.. పీఎస్‌బీలు దసరా, దీపావళి పండుగల సమయంలో 374 జిల్లాల పరిధిలో రుణ మేళాలను నిర్వహించిన విషయం గమనార్హం. ‘‘ఈ సందర్భంగా పీఎస్‌బీలు రూ.2,52,589 కోట్ల రుణాలను

Most from this category