News


ఈ నెల 14 నుంచి బడ్జెట్‌ కసరత్తు

Monday 7th October 2019
news_main1570420511.png-28745

  • నవంబర్‌ మొదటి వారం వరకూ సమావేశాలు 
  • కొత్తగా ఎస్‌సీ, ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌లు !

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ కసరత్తు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నది. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత రానున్న రెండో బడ్జెట్‌ ఇది. మరోవైపు ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టబోయే రెండో బడ్జెట్‌  కూడా ఇదే. బడ్జెట్‌ ముందస్తు/సవరించిన అంచనాల సమావేశాలు ఈ నెల 14 నుంచి మొదలవుతాయని ఆర్థిక వ్యవహారాల విభాగం వెలువరించిన బడ్జెట్‌ సర్క్యూలర్‌(2020-21) వెల్లడించింది.  ఈ సమావేశాలకు  అవసరమైన వివరాలను ఆర్థిక సలహాదారులందరూ అందజేయాల్సి ఉందని ఈ సర్క్యూలర్‌ పేర్కొంది. వచ్చే నెల మొదటివారం వరకూ ఈ సమావేశాలు కొనసాగుతాయని పేర్కొంది. 
కొత్త అంశాలు...
వచ్చే ఏడాది బడ్జెట్లో కొత్తగా ఎస్‌సీ సబ్‌ ప్లాన్‌, ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌, లింగ, చిన్న పిల్లల బడ్జెట్‌ స్టేట్‌మెంట్స్‌ కూడా చేర్చనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ఈ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. పన్ను వసూళ్లు అంతంతమాత్రంగానే ఉండటం, మందగమనం, వృద్ది తగ్గడం తదితర క్లిష్టమైన సమస్యల నుంచి గట్టెక్కేలా ఈ బడ్జెట్‌ను రూపొందించాల్సి ఉంది. 



You may be interested

నష్టాల్లో ప్రారంభమైన రూపీ!

Monday 7th October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో సోమవారం 8 పైసలు బలహీనపడి 70.96 వద్ద ప్రారంభమైంది. కాగా ఆర్‌బీఐ ఎంపీసీ(మానెటరీ పాలసీ కమిటీ) ఈ ఏడాది వరుసగా తన ఐదవ సమావేశంలో 25 బేసిసి పాయింట్ల వరకు రెపో రేటును తగ్గించడంతో, గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 70.88 వద్ద ప్లాట్‌గా ముగిసింది. మొత్తంగా గత వారంలో రూపీ డాలర్‌ మారకంలో 32 పైసలు బలహీనపడింది.   గత సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో

నష్టాల ప్రారంభం

Monday 7th October 2019

ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాల ఫలితంగా సోమవారం భారత్‌ స్టాక్‌ సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 70 పాయింట్ల నష్టంతో 37,600 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 30 పాయింట్ల గ్యాప్‌డౌన్‌తో 11,145 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. 

Most from this category