News


వేతన జీవులకు బడ్జెట్లో వరాలు?!

Tuesday 14th January 2020
news_main1578977879.png-30914

రాబోయే బడ్జెట్లో ఉద్యోగులకు ఊరటనిచ్చే నిర్ణయాలు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్దమైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వేతనజీవులకు రూ. 2.5 లక్షల వరకు 80 కేటగిరీ సేవింగ్స్‌ కింద పన్ను మినహాయింపునకు అవకాశం కల్పించనుందని, 80సీలో కొత్త విభాగం ఏర్పరిచి రూ. 50వేల వరకు ఎన్‌ఎస్‌సీల కొనుగోలుపై పన్ను మినహాయింపును ఇవ్వనుందని తెలిపాయి. దీంతో పాటు పీపీఎఫ్‌ ఇన్వెస్టర్లకు గరిష్ఠ పెట్టుబడి పరిమితి రూ. 2.5 లక్షల వరకు అనుమతించాలని యోచిస్తున్నట్లు తెలిపాయి. చిన్నమొత్తాల పొదుపు పథకాలు ముఖ్యంగా పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీలకు సంబంధించి పన్ను ప్రోత్సాహకాల ప్రతిపాదన ఉందని, వీటిని బడ్జెట్లో ప్రకటించవచ్చని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు. వీటితో మదుపుదారులకు మరింత ప్రయోజనం చేకూరవచ్చన్నారు. ప్రస్తుతం ఐటీ యాక్ట్‌లోని 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. పీపీఎఫ్‌ అకౌంట్స్‌లో జమ చేసే మొత్తం, ఎన్‌ఎస్‌సీల కొనుగోళ్లు కూడా ఇందులోనే కవరవుతున్నాయి. జీడీపీలో దేశ ప్రజల పొదుపు పెట్టుబడి నిష్పత్తి 2011-12లో 23.6 శాతం ఉండగా 2017-18 నాటికి 17.2 శాతానికి దిగివచ్చింది. 2011-12లో దేశ జీడీపీలో ప్రజలు విత్త సంబంధిత ఆస్తుల్లో పెట్టిన పెట్టుబడుల వాటా 7 శాతం ఉండేది. ఇందులో అధిక భాగం బ్యాంకు డిపాజిట్లుండేవి. క్రమంగా ప్రజలు మరింత వినిమయం పెంచుకునేందుకు వీలు కలిగించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రస్తుతం రూ. 5 లక్షల కన్నా అధిక వార్షికాదాయం ఉన్న వైయుక్తిక టాక్స్‌పేయర్లు దేశంలో 3 కోట్లమంది ఉంటారని అంచనా. తాజాగా పన్ను రాయితీలు కల్పించడంతో వీరందరి వద్ద మిగులు నిధులు పెరిగి మరింత వినిమయం పెంచుతారని ప్రభుత్వం ఆశిస్తోంది. ముఖ్యంగా పీపీఎఫ్‌ పరిమితి రూ. లక్ష మేర పెంచడం అధిక ప్రభావం చూపుతుందని టాక్స్‌ నిపుణుడు గౌతమ్‌ మెహ్రా చెప్పారు. రాబోయే బడ్జెట్లో ఇటీవల ప్రకటించిన కార్పొరేట్‌ పన్ను కోతల తరహాలోనే వైయుక్తిక ఆదాయపన్నులో కోతలుంటాయని, అధికాదాయా వర్గాల కోసం కొత్త శ్లాబులు ప్రకటించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రతిపాదనలతో పన్ను ఆదాయాలు కొంత మేర కుంటుపడతాయని, కానీ లాంగ్‌టర్మ్‌లో ఈ నిర్ణయాలు మేలు చేకూరుస్తాయని నిపుణుల అంచనా. ఒకపక్క ఆదాయం తగ్గుతున్న సమయంలో విత్తలోటు కట్టడికి ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తోంది. 



You may be interested

యస్‌ బ్యాంక్‌ డీలా- ఐఆర్‌సీటీసీ అప్‌

Tuesday 14th January 2020

యస్‌ బ్యాంక్‌ షేరు 7 శాతం పతనం 4 శాతం జంప్‌చేసిన ఐఆర్‌సీటీసీ లిమిటెడ్‌ ఇటీవల సరికొత్త గరిష్టాలను తాకుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు నేటి(14న) ట్రేడింగ్‌లో ఒడిదొడులకులను ఎదుర్కొంటున్నాయి. కొద్ది రోజులుగా ర్యాలీ చేయడంతో స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేట్‌ అవుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యమివ్వడం ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. ఉదయం 10.20 ప్రాంతంలో సెన్సెక్స్‌ 15 పాయింట్లు బలపడి 41,874కు చేరగా.. నిఫ్టీ 8 పాయింట్లు

స్టీల్‌ ధరల పెంపు? మెటల్‌ షేర్ల మెరుపు

Tuesday 14th January 2020

మెటల్‌ ఇండెక్స్‌ 1.4 శాతం ప్లస్‌ వేదాంతా, సెయిల్‌, టాటా స్టీల్‌ జోరు వచ్చే నెల నుంచీ స్టీల్‌ ధరలు మరోసారి పెరిగే అవకాశమన్నట్లు పరిశ్రమ వర్గాలు తాజాగా పేర్కొంటున్నాయి. ఇందుకు మెటల్‌కు కనిపిస్తున్న డిమాండుతోపాటు ముడివ్యయాలు పెరగడం కారణంకానున్నట్లు తెలియజేశాయి. వెరసి వరుసగా నాలుగో నెలలోనూ స్టీల్‌ ధరలు పెరిగే వీలున్నట్లు వివరించాయి. గత రెండు నెలలుగా స్టీల్‌ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. టన్నుకి రూ. 2,000 వరకూ హెచ్చాయి. స్టీల్‌ ధరల విషయంలో

Most from this category