News


బిజినెస్‌ @ పార్లమెంట్‌ న్యూస్‌

Thursday 4th July 2019
news_main1562225813.png-26792

బీఎస్‌ఎన్ఎల్ నష్టాలు @ రూ. 14,202 కోట్లు..
గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాలు రూ. 14,202 కోట్ల స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నట్లు కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్‌సభకు తెలిపారు. 2015-16లో రూ. 4,859 కోట్లు, 2016-17లో రూ. 4,793 కోట్లు, 2017-18లో రూ. 7,993 కోట్ల మేర నష్టాలు నమోదయ్యాయి. మొబైల్ విభాగంలో తీవ్ర పోటీ వల్ల టారిఫ్‌లు తగ్గడం, సిబ్బందిపై అధిక వ్యయాలు, చాలా చోట్ల 4జీ సర్వీసులు లేకపోవడం వంటి అంశాలు బీఎస్‌ఎన్‌ఎల్ నష్టాలకు కారణమని మంత్రి వివరించారు. మరోవైపు, చైనా టెలికం సంస్థ హువావేకి అమెరికన్ తయారీ పరికరాలను సరఫరా చేసే భారతీయ సంస్థలు, అమెరికా చట్టాల కింద చర్యలు ఎదుర్కొనాల్సి రావొచ్చని ఆయన తెలిపారు. హువావేపై అమెరికా తదితర దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

ఏవియేషన్‌కు 4 సవాళ్లు ..
దేశీ విమానయాన రంగం ప్రస్తుతం ప్రధానంగా నాలుగు సవాళ్లు ఎదుర్కొంటోందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్ పురి రాజ్యసభకు తెలిపారు. మౌలిక సదుపాయాల కొరత, భారీ నిర్వహణ వ్యయాలు, పోటీ కారణంగా తక్కువ రాబడులు, కరెన్సీ మారకం తీవ్ర హెచ్చతగ్గులకు లోనవుతుండటం వీటిలో ఉన్నాయని వివరించారు. నష్టాలు, రుణభారాల మూలంగా ప్రైవేట్ రంగ జెట్ ఎయిర్‌వేస్ ఏప్రిల్ 17న మూతబడిన నేపథ్యంలో మంత్రి వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. అటు, భారీ రుణభారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ ఎయిరిండియాలో వాటాల విక్రయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పురి తెలిపారు. డిజిన్వెస్ట్‌మెంట్‌కు ముందుగా కంపెనీని నిర్వహణపరంగా లాభసాటిగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఎయిరిండియా రోజుకు రూ. 15 కోట్ల ఆదాయం ఆర్జిస్తోందని చెప్పారు. 

పెరిగిన వాణిజ్య లోటు..
గడిచిన మూడేళ్లలో 25 ప్రధాన దేశాలతో భారత వాణిజ్య లోటు గణనీయంగా పెరిగినట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియుష్ గోయల్‌ లోక్‌సభకు తెలిపారు. డిమాండ్-సరఫరా, కరెన్సీ హెచ్చుతగ్గులు, రుణ వ్యయాలు, రవాణా వ్యయాలు మొదలైన అంశాలు ఇందుకు కారణమని పేర్కొన్నారు.  25 దేశాల జాబితాలో దక్షిణ కొరియా, జపాన్‌, జర్మనీ, ఇరాక్‌, సౌదీ అరేబియా మొదలైనవి ఉన్నాయి. వివిధ దేశాల నుంచి దిగుమతులు, ఎగుమతుల మధ్య వ్యత్యాసాన్ని వాణిజ్య లోటుగా వ్యవహరిస్తారు. వస్తువులు, సేవలు మొదలైనవాటన్నింటినీ కలిపితే మొత్తం భారత వాణిజ్య లోటు 2018-19లో 103.63 బిలియన్ డాలర్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇది 84.45 బిలియన్ డాలర్లు. 

 



You may be interested

బడ్జెట్‌పై మార్కెట్‌కు ఆశల్లేవా?!

Thursday 4th July 2019

దేశీయ మార్కెట్లో తీవ్ర కదలికలను సూచించే వీఐఎక్స్‌ సూచీ గతంలో బడ్జెట్‌ సమయంలో బాగా పెరుతుండేది. బడ్జెట్లో కీలక నిర్ణయాలుంటాయన్న నమ్మకంతో వీఐఎక్స్‌లో పెరుగుదల ఉండేది. కానీ ఈ దఫా బడ్జెట్‌కు ముందు వీఐఎక్స్‌ సూచీ బాగా తక్కువగా ఉంది. బడ్జెట్‌పై మార్కెట్‌కు పెద్దగా అంచనాల్లేవనేందుకు ఇది నిదర్శనంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. బడ్జెట్‌ ప్రకటనలు భారీ కదలికలను ప్రేరేపించేవిగా ఉండవని మార్కెట్లు భావిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ వీఐఎక్స్‌ 13.5 వద్ద

ఎవరి రూటు వారిదే!!

Thursday 4th July 2019

కాలాన్ని బట్టి మారుతున్న బడ్జెట్లు సంక్షేమ పథకాలపైనే కాంగ్రెస్‌ ఫోకస్‌ ఎన్డీయే పాలనలో పన్ను సంస్కరణలు న్యూఢిల్లీ: కాలంతో పాటు బడ్జెట్‌ లక్ష్యాలు కూడా మారిపోతున్నాయి. 1990వ దశకం నుంచి ఇప్పటి వరకు చూస్తే అప్పటి ప్రభుత్వ ప్రాధమ్యాలు ఏ విధంగా ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు. 1991 నుంచి బడ్జెట్‌లను గమనిస్తే.. 90వ దశకంలో ఆర్థిక సంస్కరణలకు పెద్ద పీట వేయగా, ఆ తర్వాత 2000 నుంచి 2010 మధ్య కాలంలో ద్రవ్య స్థిరీకరణకు

Most from this category